Asafoetida Benefits: వంటలకు రుచితో పాటు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనం

Asafoetida Benefits: జీవితానికైనా సరే మనిషికైనా సరే ఫ్లేవర్ ఎంత అవసరమో వంటలకు అంతే అవసరం. అందుకే  Add Flavour to Recipe అంటారు. మరి ఈ ఫ్లేవర్ దేనితో వస్తుందంటే వెంటనే వచ్చే సమాధానం ఒకటే. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2024, 04:20 PM IST
Asafoetida Benefits: వంటలకు రుచితో పాటు ఆరోగ్యానికి  అద్భుత ప్రయోజనం

Asafoetida Benefits: వంటకైనా, పికిల్స్‌కు అయినా ఫ్లేవర్ కోసం తప్పనిసరిగా ఉపయోగించే పదార్దం ఇంగువ. దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళనాట ఎక్కువగా ఉపయోగించే ఇంగువతో చాలా ప్రయోజనాలున్నాయి. ఇంగువను కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు సైతం ఉపయోగిస్తుంటారు. 

ఇంగువకు అన్ని ప్రత్యేకతలున్నందునే దక్షిణ భారత వంటల్లో ప్రధానపాత్ర వహిస్తుంటుంది. అందులోని ఔషధ గుణాలు, సువాసన కారణంగా పెద్దఎత్తున ఉపయోగిస్తుంటారు. కేవలం వంటల్లోనే కాకుండా ఆయుర్వేద చికిత్సా విదానంలో కూడా ఇంగువను ప్రధానంగా ఉపయోగిస్తారు. పచ్చళ్లు, చట్నీల్లో సువాసన లేదా ఫ్లేవర్ కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు చాలామంది ఇంగువను వాడుతుంటారు. ఇంగువతో కలిగే ఐదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

తలనొప్పి సమస్య

ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్త వాహికల్లో స్వెల్సింగ్, తలనొప్పి వంటి సమస్యలున్నప్పుడు ఇంగువ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి రోజుకు 4-5 సార్లు తాగడం అలవాటు చేసుకుంటే తలనొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. 

జీర్ణక్రియ

ఇంగువ అనేది సహజంగానే జీర్ణ సంబంధిత గుణాలకు ప్రసిద్ధి. సహజసిద్దమైన కార్మిటేటివ్‌గా పనిచేస్తుంది. ఫ్లాట్యులెన్స్, బ్లోటింగ్, ఇతర అజీర్తి సమస్యల్ని తగ్గిస్తుంది. కూరలు, పప్పులు, సూప్, ఇతర వంటల్లో కొద్దిగా ఇంగువ చేరిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

రక్తపోటు నియంత్రణ

ఇంగువలో ఉండే కొన్ని రకాల పోషక గుణాల వల్ల రక్తం పలుచబడుతుంది. అంతేకాకుండా రక్తపోటు తగ్గించేందుకు , గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. అందుకే ఇంగువ ఉన్న ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందంటారు. 

ఆస్తమా నుంచి ఉపశమనం

ఇంగువను రోజూ తీసుకోవడం వల్ల ఆస్తమా సహా ఇతర శ్వాస సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా బ్రోంకైటిస్, పొడి దగ్గును తగ్గిస్తుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉపయోగపడతాయి. గోరువెచ్చని నీటిలో కరిగించి తాగడం లేదా హెర్బల్ టీలో కలిపి తాగడం చేయవచ్చు.

పీరియడ్ నొప్పులు

నెలసరి సమయంలో అమ్మాయిలు, మహిళలకు ఎదురయ్యే నొప్పుల్నించి ఉపశమనం కల్గిస్తుంది. ఇందులో ఉండే సహజసిద్దమైన రక్తం పలుచన చేసే కాంపౌండ్స్ ఇందుకు ఉపకరిస్తాయి. శరీరంలో రక్త సరఫరాను ఇంగువ మెరుగుపరుస్తుంది. అందుకే నెలసరి సమయంలో ఎదురయ్యే బ్యాక్ పెయిన్, పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది. 

Also read: PPF Maturity Rules: 5 వేల పెట్టుబడితో 26 లక్షలు పొందే అద్భుత అవకాశం, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News