NTR - R Narayana Murthy: అప్పటి వరకు ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో బాధపడుతున్నాడు. అటు దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా అప్పటికే మూడు నాలుగు ఫ్లాపుల్లో ఉన్నాడు. అప్పటికే పూరీ జగన్నాథ్.. ఎన్టీఆర్‌కు 'ఆంధ్రావాలా' వంటి రాడ్ సినిమా ఇచ్చాడు. అలాంటి ఫ్లాప్ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్టైన సినిమా 'టెంపర్'. ఈ సినిమాలో తారక్.. అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. నీతి, నిజాయితీ అనే స్పెల్లింగ్ తెలియని హీరో ఎలా నిజాయితీ పరుడైన ఆఫీసర్‌గా మారాడు. అందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. ఈ సినిమాలో హీరోను మార్చడంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ మూర్తి పాత్ర ఎంతో కీలకం. ఆ క్యారెక్టర్‌ను పోసాని కృష్ణమురళి ఎంతో హుందాగా నటించి మెప్పించారు.
ముందుగా ఆ పాత్ర కోసం పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ అనుకున్న పేరు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి. అయితే పూరీ, ఎన్టీఆర్‌ల టెంపర్ మూవీలో ఆ పాత్ర చేయకపోవడానికి గల కారణాలను ఆర్. నారాయణ మూర్తి పలు సందర్బాల్లో ప్రస్తావించారు. ఇక 'టెంపర్' మూవీలో అలాంటి గొప్ప వేశాన్నినాకు ఇచ్చేందకు ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్‌కు హాట్సాఫ్ చెబుతున్నాను. ఒక వెరైటీ డిఫరెంట్ క్యారెక్టర్ చేయించాలని పూరీ జగన్నాథ్ అనుకున్నారు. ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరి అడిగారు. కానీ వాళ్ల ఆఫర్‌ను నేను సున్నితంగా తిరస్కరించాను. నన్ను మన్నించమని కోరాను. నేను జూనియర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్టేజ్‌కు వచ్చాను. ఇక హీరోగా ఓ ఐదారేళ్లు మించి చేయలేను. ఈ లోపు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషం వేయకూడదని అనుకున్నాను. హీరోగా రిటైర్మెంట్ ప్రకటించాలనేదే తన ఉద్దేశ్యం అన్నారు. అంతే తప్ప మరో ఉద్దేశ్యం లేదున్నారు పీపుల్స్ స్టార్.
ఆర్. నారాయణ మూర్తి అనుకున్న పాత్రను దర్శకుడు పూరీ జగన్నాథ్.. పోసాని కృష్ణమురళిలో చేయించాడు. అందులో పాత్ర పేరు కూడా నారాయణ మూర్తి పేరు పెట్టడం విశేషం. అవినీతి అధికారి అయిన ఎన్టీఆర్‌కు ఎపుడు సెల్యూట్ చేయడు. కానీ మంచివాడిగా మారిన తర్వాత సెల్యూట్ చేస్తూ పోసాని చెప్పిన డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా విజయంలో ఈ పాత్ర కీ రోల్ పోషించింది. నటుడిగా టెంపర్ మూవీతో నటుడిగా ఓ మెట్టు పైకెక్కారు. ఈ సినిమాను నిర్భయ థీమ్‌తో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించి తారక్‌కు మెమరబుల్ హిట్ అందించాడు. తెలుగులో హిట్టైన ఈ సినిమాను పలు భాషల్లో రీమేకై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక టెంపర్ మూవీతో మొదలైన ఎన్టీఆర్ జైత్రయాత్ర.. ఆర్ఆర్ఆర్ మూవీ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది.ఈ సినిమాను పరమేశ్వర ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.
Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook