RBI Regional Office: అమరావతికి నో, విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమైన ఆర్బీఐ

RBI Regional Office: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వివాదంతో అమరావతికి మరో షాక్ తగిలింది. నాడు అమరావతిలో ఏర్పాటు కావల్సిన ఆర్బీఐ కార్యాలయం ఇప్పుడు విశాఖపట్నానికి తరలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2024, 11:41 AM IST
RBI Regional Office: అమరావతికి నో, విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమైన ఆర్బీఐ

RBI Regional Office: ఏపీ రాజధాని సమస్య అమరావతి ప్రాంతాన్ని అన్ని విధాలుగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే అభివృద్ధి ఆగిపోయిందని విమర్శలు చేస్తున్నవారికి మరో దెబ్బ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ప్రతి రాష్ట్రంలో ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏపీ రాజధానిగా ఎంపికైన అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు కావల్సింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకై 11 ఎకరాల భూమి కూడా కేటాయించింది. కానీ కార్యాలయం ఏర్పాటు ఆలస్యం కావడం, ఇంతలో ప్రభుత్వం మారి మూడు రాజధానుల అంశంపై తెరపై రావడంతో ఆర్బీఐ పునరాలోచనలో పడింది. రాజధాని ఏదో తేలిస్తే అక్కడే కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఇటీవల ఓ సందర్భంలో ఆర్బీఐ వ్యాఖ్యానించింది. 

ఇప్పుడీ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిత భవిష్యత్ రాజధాని విశాఖపట్నానికే ఆర్బీఐ మొగ్గు చూపింది. విశాఖపట్నంలోనే కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమైంది. అందుకు అవసరమైన భూమి లేదా భవనం కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో..30-35 వేల చదరపు అడుగుల భవనం గుర్తించాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుుడు అధికారులు ఆ పనిలో ఉన్నారు. 

Alsor read: Maharani 3: బీహార్ రాజకీయాల థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ మహారాణి 3 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News