Pindam: అమెజాన్ ప్రైమ్ లో..అహలో అదరగొడుతున్న పిండం…ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్న సినిమా

Pindam on Amazon Prime: గత కొద్ది రోజుల క్రితం థియేటర్స్ లో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న పిండం సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదలై కూడా అందరి దగ్గర నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ అలానే ఆహారం మంచి వ్యూస్ తెచ్చుకుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2024, 12:02 PM IST
Pindam: అమెజాన్ ప్రైమ్ లో..అహలో అదరగొడుతున్న పిండం…ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్న సినిమా

Pindam OTT Release:

టీజర్, ట్రైలర్ తో బాగా ఆకట్టుకున్న సినిమా పిండం ఈ మధ్యనే థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ నటుడు శ్రీరామ్.. శ్రీనివాస్ అవసరాల.. సీనియర్ నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల మంచి ప్రమోషన్స్ నడుమ అలాగే మోస్ట్ స్కేరియెస్ట్ సినిమాగా థియేటర్స్ లో పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు తాజాగా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా అందరిని అలరిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో  కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతొంది. అలాగే అమెజాన్ ప్రైమ్ తో పాటు తెలుగు తమిళ్ భాషల్లో అహలో  అందుబాటులో ఉంది.  

కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే క్రిస్టియన్ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్‌) రైస్‌ మిల్లులో ఓ అకౌంటెంట్‌ గా పనిచేస్తూ ఉంటారు. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి  సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది చాలా పాత ఇల్లు కావడం వల్ల తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఏమిటి అసలు దానికి కారణం ఏమిటి అనేది మిగిలిన కథాంశం.

ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణ బాధ్యతలు వహించారు.  కాబట్టి థియేటర్స్ లో ఈ చిత్రాన్ని మిస్ చేసిన ప్రేక్షకులు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సాయి కిరణ్ దైదా.

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News