Happiness Hormone: ఒత్తిడిని దూరం చేసి సంతోషాన్ని పెంచే 5 ఆహారాలు ఇవే..

Happiness Hormone increasing foods: మనజీవితంలో ఎన్నోసార్లు సమస్యాత్మకమైన దశను ఎదుర్కొంటాం. కానీ వాస్తవానికి ఆనందం, విచారం అనేది మన మెదడు స్థితి. ఇది 4 హార్మోన్లు డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ,ఎండార్ఫిన్లచే నియంత్రించబడుతుంది.
 

1 /6

మీరు మీ ఆహారంతో ఈ హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేసుకోవచ్చు. అంటే, మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే లేదా ఆఫ్ మూడ్‌లో ఉన్నట్లయితే, దాన్ని సరిచేయడానికి మీరు కొన్ని సరైన ఆహారాలను తినవలసి ఉంటుంది. ఆహారాలు మీ మానసిక ఆరోగ్యాన్ని అలాగే మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచుతాయని గుర్తుంచుకోండి.  

2 /6

పాలకూర.. ఐరన్ కంటెంట్‌కు అధికంగా ఉండే పాలకూర సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి కూడా పనిచేస్తుంది. అంతేకాదు ఇందులో ఫైబర్ ,విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ ,చర్మానికి ఆరోగ్యకరమైనది. స్మూతీ, సూప్ లేదా పాలకూర కూర తినడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3 /6

మష్రూమ్స్.. మష్రూమ్స్ యాంటి డిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. మానసిక స్థితిని నియంత్రించే విటమిన్. ఇది సెరోటోనిన్ సంశ్లేషణ స్థాయికి సంబంధించినది. దీని కారణంగా వ్యక్తి సంతోషకరమైన భావోద్వేగాలను అనుభవించగలడు. మీ మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, మష్రూమ్ రెసిపీని తినడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

4 /6

అవకాడో.. 2020లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి3 ,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు సంతోషకరమైన హార్మోన్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజంతా సంతోషంగా ఉండటానికి సలాడ్, శాండ్‌విచ్ లేదా అల్పాహారంలో అవకాడోను చేర్చవచ్చు.

5 /6

డ్రై ఫ్రూట్స్.. మీరు డ్రై ఫ్రూట్స్ తినకపోతే ఈ రోజు మీ ఆహారంలో చేర్చుకోండి. ఎందుకంటే ప్రతిరోజూ కొన్ని బాదం లేదా వాల్‌నట్‌లను తినడం వల్ల కోరికలు తగ్గుతాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇలా జరుగుతుంది. 

6 /6

డార్క్ చాకొలేట్.. ఓ నివేదిక ప్రకారం డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది, సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది