LPG Gas Cylinder Changes: దేశంలోని గ్యాస్ కంపెనీల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వినియోగాదారుల ప్రయోజనార్ధం కొత్త సౌకర్యం ప్రవేశపెట్టింది. ఫ్యూర్ ఫర్ స్యూర్ పేరుతో ఈ కొత్త విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ గ్యాస్ కస్టమర్లకు క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లను ఇంటి వద్దకు అందించే కార్యక్రమంలో భాగంగా బీపీసీఎల్ పూర్ ఫర్ స్యూర్ చేపట్టింది. దేశంలో ఈ తరహా సేవలు అందించడం ఇదే తొలిసారి. ఇక నుంచి వినియోగదారులకు సరఫరా చేసే గ్యాస్ సిలెండర్లపై టెంపర్ ప్రూఫ్ సీల్ ఉంటుంది. క్యూర్ ఆర్ కోడ్ దర్శనమిస్తుంది. అంటే కంపెనీ నుంచి సిలెండర్‌పై గ్యారంటీ లభిస్తుంది.
గ్యాస్ సిలెండర్‌పై ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమర్లు ప్యూర్ ఫర్ స్యూర్ పాప్అప్ చూడవచ్చు. అంటే సిలెండర్ ఫిల్ చేసే సమయానికి మొత్తం బరువు ఎంత ఉంది, సీల్ మార్క్ ఉందా లేదా అనే వివరాలు తెలుస్తాయి. అంటే సిలెండర్ల కస్టమర్‌కు పూర్తి పారదర్శకతతో చేర్చడం కంపెనీ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. సిలెండర్ సీల్ ట్యాంపర్ చేసుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ కాదు. అంటే పంపిణీ నిలిచిపోతుంది.
ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ల పంపిణీలో దొంగతనం, డెలివరీ చేసే సమయానికి కస్టమర్ అందుబాటులో ఉండటం వంటి చాలా సమస్యలకు ఈ మార్గం ద్వారా పరిష్కారం లభిస్తుంది. అంటే ఇక నుంచి కస్టమర్‌కు చేరే గ్యా స్ సిలెండర్ క్వాలిటీ, క్వాంటిటీ రెండూ కలిగి ఉంటుంది.
Also read: SBI Bank Alert : ఎస్బీఐ కస్టమర్లకు అలెర్ట్.. మీకు పొరపాటు ఈ మెసేజ్ వస్తే జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook