China: ఇదేం అరాచకం భయ్యా... ౩ సెకన్ల రివ్యూలు చెబుతూ.. వారానికి 120 కోట్లు సంపాదిస్తున్న అందాల భామ..

Social Media: రివ్యూలు చెబుతూ జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే యువతి సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈమె ఏ ప్రాడక్ట్ లకు ఐన కేవలం మూడు సెకన్లపాటే రివ్యూలు చెబుతుంది. ఇలా ఆమె వారానికి 120 కోట్ల సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆమెకు ఉన్న ఫ్యాన్స్  ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 8, 2024, 07:03 PM IST
  • - రివ్యూలు చెబుతూ అదరగొడుతున్న అందాల భామ..
    - ౩సెకన్ల రివ్యూలు చెబుతూ 120 కోట్ల సంపాదన..
China: ఇదేం అరాచకం భయ్యా... ౩ సెకన్ల రివ్యూలు చెబుతూ.. వారానికి 120 కోట్లు సంపాదిస్తున్న అందాల భామ..

China Zheng Xiang Xiang Earns Rupees 120 Crore A Week: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. మనలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అదే విధంగా తమ దైన స్టైల్ లో సోషల్ మీడియా, ఇన్ స్టా, ఫెస్ బుక్ లో యాక్టివ్ గా ఉంటారు. కొందరు పాటలు పాడుతూ, వెరైటీ రీల్స్ చేస్తూ, ఏదైన స్టంటల్ లు చేస్తుంటారు. తమ ట్యాలెంట్ తో ఫాలోయింగ్ పెంచుకొవాలని ట్రై చేస్తుంటారు. ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజ్ అన్నమాట. ఫాలోయింగ్ పైనే యాడ్స్ వస్తాయి. దాంతోనే కదా ఇన్ కమ్ జనరేట్ అవుతుంది.  

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ASTRO XUAN (@xuan.com.my)

సోషల్ మీడియాలో తమకున్న ఫాలోయింగ్ ను బట్టి మార్కెట్ లో వారికి యాడ్స్, బిజినెస్ అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలా మంది ఆన్ లైన్ లో ఏదైన వెరైటీ గా చేయడానికి తెగ కష్టపడుతుంటారు. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన ఒక జెంగ్ జియాంగ్ జియాంగ్ యువతి కేవలం యాడ్ లకు రివ్యూలు చెబుతూ వారానికి  120 కోట్ల  వరకు సంపాదిస్తుంది. ఆమెకు సోషల్ మీడియా, ఇన్ స్టా, ఫెస్ బుక్ లలో కలిపి మిలియన్ల కొద్ది ఫాలోయింగ్ లున్నారు. దీంతో ఆమె చెప్పే రివ్యూలు మెరుపు వేగంతో జనాల్లోకి వెళ్లిపోతాయని చాలా మంది భావిస్తారు. అందుకే ఆమె దగ్గరు రివ్యూలు చెప్పించుకునేందుకు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని కస్టమర్లు వెయిట్ చేస్తుంటారంటే, ఆమెకున్న డిమాండ్ ను అర్థం చేసుకొవచ్చు. 

చైనాకు చెందిన జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే యువతి.. రివ్యూలు చెబుతూ వారినికి కోట్లలో సంపాదిస్తుంది.  టిక్‌టాక్ యాప్ చైనీస్ వెర్షన్ అయిన డౌయిన్‌లో ఐదు మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉంది.  జెంగ్ ఒక ప్రాడక్ట్  కు ప్రమోట్ చేయడంలో అసాధారణమైన,  మెరుపు-వేగవంతమైన పద్ధతిని ఫాలో అవుతుంది.  ఆమెకు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మాదిరిగా కాకుండా, వారు ప్రమోట్ చేస్తున్న ఉత్పత్తుల యొక్క ప్రతి వివరాలను నిశితంగా వివరిస్తుంది. ఆమె ఒక ఉత్పత్తిని మూడు సెకన్ల పాటు మాత్రమే ప్రమోట్ చేస్తుంది. 

ఆమె లైవ్ స్ట్రీమ్‌ల సమయంలో, జెంగ్ సహాయకురాలు అనేక  వస్తువులను కలిగి ఉన్న నారింజ రంగు పెట్టెలను ఒక్కొక్కటిగా అందజేస్తుంది. మిల్లీసెకన్ల వ్యవధిలో, ఆమె ప్రతి ఉత్పత్తిని ఎంచుకొని, దానిని కెమెరాకు ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తుంది.  ప్రాడక్ట్ ధరను, ప్రాడక్ట్ వివరాలను బుల్లెట్ వేగంతో చెప్పేస్తుంది. ఇదంతా కేవలం మూడు సెకన్లలో (ఒక ఉత్పత్తికి) జరిగిపోతుంది. 

Read More: Ashika Ranganath: చూపులతో మెస్మరైజ్ చేస్తున్న వరాలు.. ఆషికా లేటెస్ట్ పిక్స్ అదుర్స్..

కేవలం సెకన్లలో తన ప్రేక్షకులను ఆకర్షించగల జెంగ్ సామర్థ్యం మనస్సును కదిలించే ఆదాయాలుగా మార్చబడింది. ఆమె ప్రతి వారం నమ్మశక్యం కాని $14 మిలియన్ (దాదాపు ₹ 120 కోట్లు) సంపాదిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనమాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News