Iqoo Neo 9 Pro Expected Price: భారత మార్కెట్లోకి మరో ప్రీమియం మొబైల్ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
ప్రముఖ టెక్ కంపెనీ iQoo శుభవార్త తెలిపింది. ఫిబ్రవరి 22న కంపెనీ భారత్ వ్యాప్తంగా iQoo Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ ఈ మొబైల్‌ను గత సంవత్సరంలోనే డిసెంబర్ నెలలో చైనాలో విడుదల చేసింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే ఈ iQoo Neo 9 Pro స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ మొబైల్‌ను మొదట 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు సమాచారం.
8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ఈ iQoo Neo 9 Pro స్మార్ట్ ఫోన్ ధర రూ.37,999గా ఉంటుందని లీక్ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా మొదటి సేట్లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. వీటి ద్వారా దాదాపు రూ.3 వేల వరకు తగ్గింపు పొందవచ్చే.
ఇంతక ముందు పలువురు టిప్‌స్టర్స్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ iQoo Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్లు కలిగిన ధర రూ. 40,000 ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ 5,160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ iQoo Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభించింది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు రూ.1,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అయితే..ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. అయితే అమెజాన్ కూడా ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ వెబ్సైట్లో కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇక iQoo Neo 9 Pro మొబైల్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..కాంకరర్ బ్లాక్, ఫైరీ రెడ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు ఈ మొబైల్ 6.78 అంగుళాల LTPO AMOLED డిస్ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి.
దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో OISతో 50 మెగాపిక్సెల్ IMX920 బ్యాక్ కెమెరాను కలిగి ఉంటాయి. అలాగే 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాతో రాబోతోంది. అంతేకాకుండా 5,160mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది.