Sovereign Gold Bond: గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి గోల్డెన్ ఛాన్స్. తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. ఫిజికల్ గోల్డ్ కు ప్రత్యామ్నాయంగా గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయుటకు మరోసువర్ణ అవకాశం. అంతేకాదు తక్కువ ధరలకే ఇక్కడ మీరు ప్యూర్ 99.99 శాతం గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు.
మీరూ ఈ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయాలంటే నిర్ధిష్ట బ్యాంకులు, వివిధ ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంచనుంది. ఇది వరకు డిసెంబర్ 22న కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ పెట్టుబడిదారులకు అవకాశం కల్పించనుంది. ఎవరైనా ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము మరియు గరిష్టంగా 4 కిలోల బంగారాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ ఆర్బీఐ జారీ చేసే కేంద్ర ప్రభుత్వ బాండ్. అంతేకాదు, SGB ని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు. ఈ స్కీంలో మీరు గ్రాము బంగారం నుంచి కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ ద్వారా మీరు 24 క్యారెట్ల 99.9% స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే డిజిటల్ చెల్లింపుపై గ్రాముకు రూ.50 తగ్గింపు లభిస్తుంది.
ఇదీ చదవండి: మార్చి 31 లోగా ఈ చిన్నపని పూర్తిచేయండి.. లేదంటే మీ ssy, ppf ఖాతాలు క్లోజ్..
ఎక్కడ కొనాలి?
1. బ్యాంకులు, ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు
2. BSE, NSE ప్లాట్‌ఫారమ్‌లు
3. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్.
4. పోస్టాఫీసు
ఇదీ చదవండి: పోస్ట్ఆఫీస్ ఫుల్ పైసావసూల్ స్కీం.. లక్షకు రూ. 2 లక్షలు పక్కా..!
SGB వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
1. సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై ఏడాదికి 2.4 శాతం వడ్డి లభిస్తుంది.
2. ఇది GST పరిధిలోకి రాదు
3. డీమ్యాట్ కావడంతో భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
4. మెచ్యూరిటీ తర్వాత బంగారంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
5. ఇది కాగితం కాబట్టి మీరు దాని స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి