Anti Cheating bill: ఎగ్జామ్ లలో చీటింగ్ చేశారో ఇంకా గోవిందా.?.. పదేళ్ల జైలు, కోటి జరిమాన.. డిటెయిల్స్ ఇవే..

PM Narendra Modi: పాఠశాల పరీక్షలు, కళాశాల ప్రవేశ పరీక్షలు లేదా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల కోసం పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసిన దోషులను శిక్షించేందుకు ప్రభుత్వం సోమవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దీనిలో చీటింగ్ కు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకునేలా అంశాలు పొందుపర్చారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 5, 2024, 05:36 PM IST
  • - లోక్ సభలో యాంటీ చీటింగ్ బిల్..
    - వారెంట్ లేకుండా అరెస్టుకు అవకాశం..
    - స్కూల్ ఎగ్జామ్ నుంచి యూపీఎస్సీ వరకు వర్తింపు..
 Anti Cheating bill: ఎగ్జామ్ లలో చీటింగ్ చేశారో ఇంకా గోవిందా.?.. పదేళ్ల జైలు, కోటి జరిమాన.. డిటెయిల్స్ ఇవే..

Centre Governments New Anti Cheating Bill: ప్రస్తుతం ఎగ్జామ్ ల నిర్వాహణ పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు. అది స్కూల్ ఎగ్జామ్ లు అయిన లేదా  సర్కారు ఉద్యోగాలపైన, కాలేజీ ఎగ్జామ్ లు అయిన కూడా ప్రతి దానిలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు లీక్ లు కావద్దని ఎంత జాగ్రత్తగా తీసుకున్న కూడా తీరా ఎగ్జామ్ టైమ్ కు వాట్సాప్ లో, సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాలు దర్శనమిస్తున్నాయి.

Read More: Lord Shiva: ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదా..?.. సోమవారం ఈ చిన్న రెమిడీ చేసి చూడండి.. వారంలో గుడ్ న్యూస్..

అనేక రాష్ట్రాలలో పేపర్ లీక్ ల సమస్య పెద్ద సమస్యగా మారింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎంత కష్టపడి రాసిన పేపర్ ఆ తర్వాత లేక్ అవ్వడం వల్ల చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో కేంద్రం క్యాబినెట్ మంత్రి నిర్మల సీతారామన్ దీనికి చెక్ పెట్టేలా చర్యలకు ఉపక్రమించారు. సోమవారం.. కేంద్రం కొత్తగా యాంటీ చీటింగ్ బిల్లును రూపొందించింది.

దీనిలో స్కూల్ నుంచి, కాలేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల ఎగ్జామ్ లు, రైల్వే ఎగ్జామ్, యూపీఎస్సీ మొదలైన అన్ని ఎగ్జామ్ లలోను చీటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో అంశాలను చేర్చారు. అంతే కాకుండా.. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ నేరాన్ని పరిగణించేలా ఈ బిల్ రూపొందించారు. ఎవరైన చీటింగ్ చేస్తూ దొరికిపోతే.. 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి జరిమానా ను విధిస్తారు. 

కొత్త బిల్లు చిత్తశుద్ధితో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను లక్ష్యంగా చేసుకోదు. కేవలం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) బిల్లు ప్రకారం, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి లేదా జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి మాత్రమే 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹ 1 కోటి జరిమానా విధించబడుతుంది.

ఈ బిల్లు లో హైలేట్ ఏంటంటే.. ఈ బిల్లు కింద ఉన్న అన్ని నేరాలు గుర్తించదగినవి, నాన్-బెయిలబుల్,  నాన్-కాంపౌండ్ చేయదగినవి. అంటే  పోలీసులకు సొంతంగా చర్య తీసుకునే అధికారం ఉంటుంది (ముఖ్యంగా ఎలాంటి వారెంట్ లేకుండా అనుమానితులను అరెస్టు చేయడానికి ఫుల్ రైట్స్ ఉంటాయి), నిందితుడికి బెయిల్‌కు అర్హత ఉండదు.

 ఆరోపించిన నేరాలు రాజీ ద్వారా పరిష్కరించబడవని ఈ చట్టంలో బందో బస్తుగా అంశాలు చేర్చారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ కూడా స్పందించారు. ఎగ్జామ్ లలో కష్టపడి చదివి, దేశానికి సేవలు చేసేలా ఎదగాలని సూచించారు. ఈ బిల్ చీటింగ్ చేసే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుందన్నారు. 

కొత్త యాంటీ-చీటింగ్ బిల్లు ప్రకారం..

ఈ కొత్త బిల్లులో భాగంగా, పార్లమెంటును క్లియర్ చేసి, చట్టంగా మారడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపిస్తారు. అదే విధంగా.. పరీక్షా ప్రక్రియను రూపొందించడానికి సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయబడుతుందన్నారు.  ఈ సిఫార్సులలో ఫూల్ ప్రూఫ్ IT భద్రతా వ్యవస్థలు, పరీక్షా కేంద్రాలపై నిఘా,  అన్ని పరీక్షా కేంద్రాలకు భౌతిక,  డిజిటల్ మౌలిక సదుపాయాల కనీస ప్రమాణాలు ఉంటాయి.

పేపర్‌ను లీక్ చేయడం లేదా జవాబు పత్రాలను ట్యాంపరింగ్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి లేదా సమూహం కనీసం మూడేళ్ల జైలు శిక్షను అందుకుంటారు. ₹ 10 లక్షల వరకు జరిమానాతో దీన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. సర్వీస్ ప్రొవైడర్‌లు నేరాలకు పాల్పడితే.. ₹ 1 కోటి వరకు జరిమానా విధించవచ్చు. అటువంటి సంస్థల యొక్క సీనియర్ మేనేజర్‌లకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడవచ్చు. చివరగా, "పేపర్ లీక్ యొక్క వ్యవస్థీకృత నేరం"లో దోషులుగా తేలిన వారు ఐదు నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను పొందవచ్చు మరియు ₹ 1 కోటి వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

Read More: Weight Loss: వాల్‌నట్స్‌తో కూడా బరువు, BPని తగ్గించుకోవచ్చు..ఇలా చేయండి రోజు..

కొత్త బిల్లులో కవర్ అయ్యే పరీక్షలు.. 

- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షల కోసం)

- స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (అంటే, కేంద్ర మంత్రిత్వ శాఖలు,  సబార్డినేట్ కార్యాలయాల్లోని పోస్టుల కోసం)

- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (అంటే, భారతీయ రైల్వేలలో కొన్ని రకాల ఉద్యోగాల కోసం)

- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు)

- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షల కోసం)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News