IND vs ENG 2nd Test Day 3 Live: వైజాగ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. టెస్టులో ముచ్చటగా మూడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. 147 బంతుల్లో రెండు సిక్సర్లు, 11 ఫోర్లు సహాయంతో 104 పరుగులు చేసి ఔటయ్యాడు. గత 13 ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచిన గిల్.. కీలక సమయంలో శతకం సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు.
ఓవర్ నైట్ స్కోరు 28తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 13 పరుగులు చేసిన అతడిని జేమ్స్ అండర్సన్ పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే డబుల్ సెంచరీ హీరో జైశ్వాల్ ను కూడా అండర్సన్ ఔట్ చేశాడు. 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను శుభమన్ గిల్ ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.
Also Read: SL vs AFG: క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే క్యాచ్ పట్టిన సమరవిక్రమ, వీడియో వైరల్
జట్టు స్కోరు వంద పరుగుల ధాటిన తర్వాత శ్రేయస్(29) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పటిదార్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం గిల్ కు జత కలిసిన అక్షర్ స్కోరును రెండొందలు దాటించారు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ బషీర్ ఔట్ చేశాడు. కాసేపటికే అక్షర్ కూడా ఔటయ్యాడు. దీంతో టీమిండియా 61 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్, ఆశ్విన్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 365 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: Virat Kohli: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట.. క్లారిటీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook