Payal Rajput: ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన 'మంగళవారం' .. ఏకంగా నాలుగు అవార్డులు సొంతం

Excerpt: Jaipur Filmfare Awards : ఆర్ఎక్స్ 100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మంగళవారం. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు అవార్డులను గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 06:31 PM IST
Payal Rajput: ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన 'మంగళవారం' .. ఏకంగా నాలుగు అవార్డులు సొంతం

Mangalavaram : ఆర్ఎక్స్ 100 వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయిన అజయ్ భూపతి ఈ మధ్యనే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ తో మంగళవారం అనే మరొక సినిమా చిత్రీకరించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా గతేడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. 

మొదటి రోజు నుంచి మంచి టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా నమోదు చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బోల్డ్ కథతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక ఆసక్తికరమైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకి మంచి ఓపెనింగ్ లభించింది. 

మంచి టాక్ తో ముందుకు సాగిన ఈ చిత్రం 15 కోట్ల మార్కును కూడా దాటి హిట్ చిత్రంగా పేరు నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతోంది. థియేటర్లలో మాత్రమే కాక ఓటీటీ లో కూడా ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంది. 

అయితే వచ్చే నెల ఫిబ్రవరి 9 నుండి 13వ తారీకు వరకు జరగబోతున్న జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా పేరు మారు మ్రోగిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అవార్డులు ఈ సినిమా గెలుచుకోవడం విశేషం. నాలుగు విభిన్న అవార్డులు పొంది ఈ చిత్రం చాలామందికి షాక్ ఇచ్చింది.

ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి, నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమాలు కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ప్రదర్శింపబడునున్నాయి. ఇక అవార్డుల సంగతికి వస్తే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.  

ఇక సౌండ్ డిజైన్‌లో రాజా కృష్ణన్ చేసిన విశేష కృషికి కూడా అవార్డుతో గుర్తింపు లభించింది. ఈ చిత్రం ఉత్తమ ఎడిటింగ్‌ అవార్డ్ ఎడిటర్ గుల్లపల్లి మాధవ్ కుమార్‌కు దక్కింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డ్ అందుకున్నారు ముదాసర్ మహ్మద్. చిత్రయూనిట్ ఈ విజయాలను అధికారికంగా ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో చిత్ర బృందం పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News