Ayodhya Ramlala Package: ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజ్ ప్రారంభించింది. అయోద్య రామమందిరం దర్శనంతో పాటు దేశంలోని మూడు జ్యోతిర్లింగాల సందర్శన ఉంటుంది. అయోధ్య రామాలయంతో పాటు కాశీ విశ్వనాథ్, మహా కాళేశ్వర్, త్రయంబకేశ్వర్ ఆలయాల్ని సందర్శించుకోవచ్చు. ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజ్ గురించి వివరంగా తెలుసుకుందాం..
ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ కార్పొరేషన్ ప్రతిరోజూ ప్రయాణీకుల కోసం కొత్త కొత్త ప్యాకేజిలు అందిస్తోంది. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఇతర వెకేషన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఐఆర్సీసీటీసీ ప్రత్యేక ప్యాకేజ్‌లో అయోధ్య థామ్, నాసిక్, వారణాసిలు సందర్శించవచ్చు. అయోధ్య రామమందిరంతో పాటు కాశి విశ్వనాథ్, మహా కాళేశ్వర్, త్రయంబకేశ్వర్‌లను ఈ ప్యాకేజ్‌లో భాగంగా దర్శించవచ్చు. ఇది ట్రైన్ టూర్ ప్యాకేజ్. ఇందులో 9 రాత్రులు, 10 రోజులుంటాయి. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైంది. ఈ ప్యాకేజ్ రాజ్‌కోట్ నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో అయోధ్య, ప్రయాగ్‌రాజ్, శృంగవేర్పూర్, చిత్రకోట్, వారణాసి ఉజ్జయిని, నాసిక్ ఉన్నాయి. ఈ ప్యాకేజ్‌లో రైల్వే టికెట్లు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వసతి అన్నీ ఉంటాయి. యాత్రికులు రాజ్‌కోట్, సురేంద్ర నగర్, వీరంగం, సబర్మతి, నడియాడ్, ఆనంద్, ఛాయాపూరి, గోద్రా, దహోడ్, మేఘ్ నగర్, రత్లాంలలో ఎక్కడి నుంచైనా టూర్‌లో జాయిన్ కావచ్చు.
ఐాఆర్సీసీటీ ప్యాకేజ్ ప్రత్యేకతలు
ఈ ప్యాకేజ్ పేరు శ్రీ రామ జన్మభూమి. అయోధ్య, ప్రయాగ్ రాజ్ 3 జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుంది. అయోధ్య ప్రయాగ్‌రాజ్, శృంగవేర్పూర్, చిత్రకోట్, వారణాసి, ఉజ్జయిని, నాసిక్ చుట్టి రావచ్చు. ఫిబ్రవరి 5 నుంచి ఈ యాత్ర మొదలౌతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. 10 రోజులు, 9 రాత్రుళ్లు ఉంటాయి. రైలు ద్వారానే ప్రయాణం ఉంటుంది. ఇందులో స్లీపర్, థర్డ్, సెకండ్ ఏసీ కేటగరీలుంటాయి.
20 వేల నుంచి ప్యాకేజ్ ప్రారంభం
ఐఆర్సీటీసీ శ్రీ రామ జన్మభూమి ప్యాకేజ్‌లో కేటగరీని బట్టి ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ 20, 500 రూపాయల్నించి మొదలౌతుంది. ఈ ప్యాకేజ్ స్లీపర్ కేటగరీకు వర్తిస్తుంది. ధర్డ్ ఏసీ అయితే 33 వేల రూపాయలు ఒక్కొక్కరికి ఉంటుంది. ఇక సెకండ్ ఏసీకు 46 వేల రూపాయలు. irctctourism.com.వెబ్‌సైట్ ద్వారా యాత్రికులు టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు.
Also read: February New Rules: ఫిబ్రవరి నుంచి మారిపోతున్న రూల్స్, ఎన్‌పీఎస్, ఫాస్టాగ్, గోల్డ్ బాండ్‌లో మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ayodhya Ramlala Package: రామ మందిరం దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజ్