Police Leopard: స్టేషన్‌లోకి దూరిన చిరుతను చూసి దాక్కున్న పోలీసులు.. ఇది పోలీస్‌ పులి

Ratnagiri District: అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ప్రజల ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ పులి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది. స్టేషన్‌ అంతా తిరగడంతో పోలీసులు భయాందోళన చెందారు. పులి దెబ్బకు స్టేషన్‌ను వదిలేసి వెళ్లారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2024, 08:33 PM IST
Police Leopard: స్టేషన్‌లోకి దూరిన చిరుతను చూసి దాక్కున్న పోలీసులు.. ఇది పోలీస్‌ పులి

Leopard in Police Station: ఓ చిరుత పోలీస్‌ స్టేషన్‌లోకి దూసుకొచ్చింది. పులి రావడంతో స్టేషన్‌ అంతా నిర్మానుష్యంగా ఉంది. పోలీసులు భయాందోళనతో బయటకు పరుగులు పెట్టడంతో పులి స్టేషన్‌లో చక్కర్లు కొట్టింది. పులి రావడంతో కుక్కల గుంపు అరిచాయి. తరిమేందుకు ప్రయత్నించగా పులి భయంతో అవి కూడా పరుగులు పెట్టాయి. చివరకు ఒక కుక్కను నోట కరుచుకుని పులి ఎంచక్కా వెళ్లిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా రాజాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. ఈనెల 24వ తేదీన బుధవారం రాత్రిపూట పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోకి పులి వచ్చింది. పులి రావడంతో కుక్కలు భయపడ్డాయి వెంటనే అటుఇటు తిరుగుతూ పరుగులు పెట్టాయి. పులి నేరుగా స్టేషన్‌లోకి వచ్చి ఓ గదిలోకి దూసుకెళ్లింది. అక్కడ కలియ తిరిగి మళ్లీ బయటకు వచ్చింది. వచ్చేటప్పుడు ఓ కుక్కను నోటితో పట్టుకుని వచ్చింది. ఈ పులి రావడంతో మళ్లీ కుక్కలు పరుగులుపెట్టాయి.

పులి రావడంతో స్టేషన్‌ సిబ్బంది అంతా ముందే బయట ఉన్నారు. దీంతో స్టేషన్‌ అంతా నిర్మానుష్యంగా కనిపించింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న సిబ్బంది స్టేషన్‌ బయట ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పులి వెళ్లిపోయాక యథావిధిగా పోలీసులు స్టేషన్‌లోకి వచ్చి విధులు నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సమాజంలో పులిగా భావించే పోలీసులు నిజంగా పులి వస్తే మాత్రం భయపడ్డారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రత్నగిరి జిల్లా అటవీ ప్రాంతానికి చేరువగా ఉంటుంది. అక్కడ ఉండే అభయారణ్యం నుంచి వన్యప్రాణులు తరచూ బయటకు వస్తుంటాయి. అలానే ఈ పులి కూడా వచ్చి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా వన్యప్రాణుల తమకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులను పోలీస్‌ శాఖ కోరుతోంది.

Also Read: Ra Kadali Ra: జగన్‌ను దించడానికి మేం 'సిద్ధం'గా ఉన్నాం: 'రా కదిలి రా' సభలో చంద్రబాబు
 

Also Read: Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News