Chiranjeevi - Padma Vibhushan: చిరంజీవి కంటే ముందే సినీ రంగం నుంచి పద్మవిభూషణ్ అందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Chiranjeevi - Padma Vibhushan: చిరంజీవి ఇంటికి మరో పద్మ అవార్డు వచ్చి చేరింది. 2024గాను కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. చిరుతో పాటు ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ వన్ కథానాయిక వైజయంతీ మాల బాలిని కూడా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు.  ఈ సందర్బంగా వైజయంతిమాల బాలి, చిరంజీవి కంటే ముందు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖలు విషయానికొస్తే..  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 26, 2024, 09:33 AM IST
Chiranjeevi - Padma Vibhushan: చిరంజీవి కంటే ముందే సినీ రంగం నుంచి పద్మవిభూషణ్ అందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Chiranjeevi - Padma Vibhushan:చిరంజీవి కీర్తి కిరిటంలో మరో అవార్డు వచ్చి చేరింది. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్‌ను 2024 గాను పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.ఈయనతో పాటు సీనియర్ బాలీవుడ్ నటి దక్షిణాదికి చెందిన వైజయంతిమాల బాలిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ అందుకున్న సినీ ప్రముఖుడు అక్కినేని నాగేశ్వర రావు. ఈయనకు కేంద్ర ప్రభుత్వం 2011లో అప్పటి రాష్టపతి ప్రతిభా పాటిల్ నుంచి అందుకున్నారు. 2011లో దివంగత లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కేంద్ర ప్రభుత్వం చనిపోయిన తర్వాత అత్యున్నత పద్మ విభూషణ్‌ అవార్డుతో గౌరవించింది.

ఇక సినీ రంగం నుంచి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి గాన కోకిల భారత రత్న లతా మంగేష్కర్. 1999లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్‌ చేతులు మీదుగా అందుకున్నారు.
 
ఆ తర్వాత లతా మంగేష్కర్ చెల్లెలు ఆషా భోంస్లేకు 2008లో కేంద్రం పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది.ఈమె అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులు మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.

2011లో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత.. 2015లో అప్పటి దిగ్గజ నటులు దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్‌లను కేంద్రం ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా బిగ్ బీ ఈ అవార్డు అందుకున్నారు. అటు దిలీప్ కుమార్‌కు అనారోగ్య కారణాలతో ఈ అవార్డును అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేసారు.
2016లో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా సూపర్ స్టార్ రజినీకాంత్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు.

2017లో గాన గంధర్వుడు కే.జే.ఏసుదాసు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  చేతులు మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇక 2018లో ఇసై జ్ఞాని ఇళయరాజా ఈ అత్యున్నత దేశ పౌర పురస్కారం అందుకోవడం విశేషం.
2021లో లెజండరీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత ఈ అవార్దు అందజేసింది కేంద్రం. తాజాగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని దేశ అత్యున్నత పౌరస్కరం ప్రకటించింది. అటు ఒకప్పటి బాలీవుడ్ ఫస్ట్ స్టార్ హీరోయిన్ వైజయంతి మాల బాలీని కూడా కేంద్రం రెండో అత్యున్నత పౌరపురస్కాంతో సత్కరించడం విశేషం. త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News