Sukanya Samriddhi Yojana: ఆర్థిక స్తోమత లేక చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలు అమ్మాయిలను చదువును మధ్యలోనే మాన్పించేస్తున్నారు. అంతేకాకుండా తగినంత డబ్బులేక మంచి వరుడుకు ఇచ్చి పెళ్లి చేయలేకపోతున్నారు. దీని దృష్టిలో ఉంచుకుని ఓ అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన (SSY). ఇది లాభదాయకమైన చిన్న పొదుపు పథకం. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వారికి ఇది మంచి స్కీమ్ అనే చెప్పాలి. ఇందులో ముందుగా చేరితో అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేనాటికి అంటే 21 ఏళ్లు నిండినప్పుడు ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది.
టాక్స్ బెనిఫిట్స్
ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీకు మూడు రెట్లు లాభాన్ని ఇస్తుంది. మీరు ఏడాదికి కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మీ స్తోమతను బట్టి మీరు కట్టుకోవడం మంచిది. మెుత్తం రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ మెంట్ చేస్తే 8.2% వడ్డీతో మీకు మెచ్యూరిటీ తీరే సమయానికి రూ.70 లక్షలు వస్తుంది. చిన్న పొదుపు పథకాల్లో అత్యధిక వడ్డీ చెల్లించే స్కీమ్ ఇదే. ఆదాయపు పన్ను చట్ట 80సి సెక్షన్ కింద ఏడాదికి రూ. 1.5 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను నుండి మినహాయించబడుతుంది.
Also Read: Jio Prepaid plans: 84 రోజుల వ్యాలిడిటీతో అత్యధిక డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్స్
ఎన్ని సంవత్సరాలు కట్టాలంటే..
ఈ స్కీమ్ 21 సంవత్సరాల పాటు ఉంటుంది. మీ కుమార్తెకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాత చేతికి డబ్బు వస్తుంది. మీరు మధ్యలో కూడా డబ్బులు తీసుకోవచ్చు. మీ కూతురుకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమె చదువు కోసం మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో సగం డబ్బును తీసుకునే వీలుంది. మీరు ఈ పథకంలో చేరినప్పటి నుంచి 15 సంవత్సరాలు పాటు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 21 సంవత్సరాలు తర్వాత మీ చేతికి మెుత్తం సొమ్ము అందుతుంది. మీ కుమార్తెకు పదేళ్లు లోపు ఉన్నప్పుడే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ పోస్టాఫీసు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంది.
Also Read: PPF Benefits: నెలకు 5 వేలు డిపాజిట్..మెచ్యూరిటీ తరువాత 26 లక్షలు ఎలాగంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook