Barrelakka Next Political Step: తెలంగాణలో గతేడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క అలియా కర్నె శిరీష పోటీ చేసిన విషయం తెలిసిందే. నాటి ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసాన్ని వివరిస్తూ ఎన్నికల్లో నిలిచి సంచలనం రేపింది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 6 వేల ఓట్లను సాధించింది. ఆ సమయంలో బర్రెలక్కకు చాలా మంది నిరుద్యోగులు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. అదే మాదిరి తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శిరీష ప్రణాళికలు వేసుకుంటోంది.
నిరుద్యోగుల గొంతుకగా పోటీ చేయడంతో శిరీషకు అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు మరోసారి అదే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఎన్నికల్లో పోటీతో శిరీషకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పెరిగారు. ఇక ఆమె వ్యక్తిగత సోషల్ మీడియాలో అనూహ్యంగా అనుచరులు భారీగా పెరిగారు. కొందరు ఆమెకు ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. ఇప్పుడు వారందరి విజ్ణప్తుల మేరకు మరోసారి ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాజకీయాల్లో యువత ముందుండాలని.. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి శిరీష కోరుతోంది. శిరీష స్వగ్రామం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకు వస్తుంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు శిరీష సిద్ధమవుతున్నది. ప్రస్తుతం అక్కడ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాములు ఎంపీగా కొనసాగుతున్నారు. ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు శిరీష అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లాలో చర్చ జరుగుతోంది. శిరీష వెంట కొందరు ఉన్నారని.. ఆమెను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని సమాచారం. వారి సూచనలు, ఆదేశాల మేరకు మరోమారు యువత సత్తా చాటేందుకు శిరీష సిద్ధమవుతోంది. ఓట్లు, ఫలితాలు ఎలా ఉన్నా శిరీషలాంటి యువత రాజకీయాల్లోకి రావడాన్ని మేధావులు స్వాగతిస్తున్నారు. శిరీషలాంటి యువతీయువకులు మరింత మంది ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు. యువత శక్తి రాజకీయ పార్టీలకు చాటిచెప్పేందుకు ఎన్నికలు ఒక మంచి సాధనంగా పేర్కొంటున్నారు.
Also Read: Bharat Ratna: కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం.. అసలు ఆయన ఎవరో తెలుసా?
Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook