Animal OTT: యానిమల్ టీమ్ కి సలార్ పంచ్.. దెబ్బకి బయటకి వచ్చిన ఓటిటి అఫీషియల్ డేట్

Animal OTT Official: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన సినిమా యానిమల్. డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం కొంతమంది దగ్గర నుంచి విమర్శలు తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది…  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 07:28 PM IST
Animal OTT: యానిమల్ టీమ్ కి సలార్ పంచ్.. దెబ్బకి బయటకి వచ్చిన ఓటిటి అఫీషియల్ డేట్

Salaar vs Animal:రణబీర్ కపూర్ యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బోల్ట్ కంటెంట్ వచ్చిన ఈ చిత్రం ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతమంది విమర్శించిన.. సినీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటిలో ఎప్పుడు విడుదల అవుతుంది అని అందరూ ఎదురు చూడసాగారు. కానీ సినిమాలానే ఈ చిత్రం ఓటిటి డేట్ కూడా ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ వచ్చింది.

ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది అనే వార్త వచ్చినా.. జనవరి 26 యానిమల్ ఓటిటి రిలీజ్ ఉంటుందా లేదానే ఆందోళన వారం పది రోజులుగా అభిమానుల్లో విపరీతంగా ఉంది. తమ భాగస్వామ్యం ఉన్నా ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేదని సినీ1 ఈ సినిమాపై వేసిన కేసు వల్ల ఈ చిత్రం ఓటిటి విడుదలకు చిక్కులు పడ్డాయి.

అయితే ఆ టెన్షన్ అక్కర్లేదని, డిజిటల్ రిలీజ్ కి రూట్ క్లియరయ్యిందని తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన హియరింగ్ రేపు న్యాయస్థానం ముందు మరోసారి రానుంది. అంతర్గతంగా ఇష్యూ సెటిలయ్యిందని, రేపు జరిగే కోర్టు వాయిదాలో దీనికి సంబంధించిన అంగీకారం ఇరువర్గాల నుంచి వస్తుందని వినికిడి. కాబట్టి స్ట్రీమింగ్ కి ఇబ్బంది లేదు.

కాగా ఇదే విషయాన్ని ట్విట్టర్లో యానిమల్, సలార్ సినిమాకి మధ్య జరిగిన ఒక చిన్న వివాదంతో కన్ఫామ్ చేసింది యనిమల్ చిత్రం. తాజాగా యానిమల్ సినిమా యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST)ని రిలీజ్ చేశారు. దీని కింద ఓ ప్రభాస్ అభిమాని యానిమల్ OST కూడా వచ్చేసింది సలార్‌ది దింపండిరా బాబు అంటూ కామెంట్ పెట్టారు. కాగా ఈ కామెంట్ కి యానిమల్ టీం రిప్లై ఇస్తూ దయచేసి సలార్ టీమ్‌ను అడుగు అంటూ వాళ్లకి ట్యాగ్ చేసింది. దీంతో సలార్ టీమ్ ఘాటుగా రిప్లయి ఇచ్చింది. వినబడుతుంది నాకేం చెవుడు లేదు అంటూ యానిమల్ మూవీలో ఫేమస్ డైలాగ్‌ను రణబీర్ కపూర్ GIF పోస్ట్ చేసింది. ఇందులోనే యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ప్రశ్న కూడా వేసింది. ఇక దీనికి యానిమల్ టీమ్ బదులిస్తూ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చింది.

 

"ఛాంపియన్‌కి త్వరలోనే సెల్యూట్ చేద్దాం" అంటూ జాతీయ జెండా స్టిక్కర్ పెట్టింది.  దీంతో ఈ సినిమా రిపబ్లిక్ డే రోజు రిలీజ్ కాబోతోందని ఇన్ డైరెక్టుగా ప్రకటించేసింది సినిమా యూనిట్.

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News