Chanakya Niti in Telugu: ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో జీవిత పాఠాలను చెప్పారు. అవి నేటికీ మన జీవితాల్లో ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఈరోజు మనం పురుషుల్లో ఉండే ఓ 4 లక్షణాలు స్త్రీలకు ఎంతో ఇష్టమని చెప్పారు. అవేంటో తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు స్త్రీలు కాకిలా ఉండాలి, పురుషులు కుక్కలా ఉండాలి అని చెప్పారు. అంటే ఈ జంతువులలో చాలా లక్షణాలు ఉన్నాయి. వాటిలోని కొన్ని మంచి లక్షణాలను మనం కూడా నేర్చుకోవాలని అర్థం. అదేంటో మనం కూడా తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతి మానవ జీవితానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. ఇవి జీవితాన్ని సరళంగా ,సులభంగా మార్చడంలో సహాయపడతాయి. నీతి శాస్త్రంలో ఆచార్య పురుషులకు కుక్కలో ఉన్న 4 లక్షణాలు ఉంటే అప్పుడు ఏ స్త్రీ కూడా వారిని విడిచిపెట్టదు అని చెప్పారు. ఈ లక్షణాలు మీలో ఉంటే స్త్రీ ఎప్పుడూ సంతృప్తిగా ఉంటారు. అంతేకాదు అలాంటి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి .ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. ఆ గుణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం?
1. అప్రమత్తం..
నిరంతరం అప్రమత్తంగా ఉండే లక్షణం పురుషుల్లో కచ్చితంగా ఉండాలి. గాఢనిద్ర ఉన్న వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాడని ఆచార్య చెప్పారు. అందువల్ల అప్రమత్తత చాలా ముఖ్యం. ఒక మనిషి తన కుటుంబం, భార్య ,విధుల పట్ల కుక్కలా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒక మనిషి తన కుటుంబం తన భద్రత కోసం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మీ నిద్ర ఎంత గాఢంగా ఉన్నా, చిన్న శబ్దానికి కూడా మేల్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
2. విధేయత..
ఆచార్య చాణక్యుడి ప్రకారం కుక్క తన యజమానికి విధేయంగా ఉంటుంది. అదే విధంగా, ఒక వ్యక్తి తన కుటుంబానికి ,భార్యకు విధేయుడిగా ఉండాలి. అంతే కాదు, తన పనిలో విధేయత చూపాలి, తెలియని స్త్రీలతో పురుషుడు ప్రేమలో పడితే అతని ఇంట్లో కలహాలు రావడం ఖాయం. అందుకే మగవాళ్లకు విధేయత అవసరమని చెప్పారు
Also read: Ram mandir Darshan Timings: రామమందిరం దర్శనం వేళలు ఇవే, సేవా టికెట్లు ఇలా బుక్ చేసుకోవాలి
3. శౌర్యం..
ఆచార్య చాణక్యుడు ప్రకారం మనిషి కుక్కలా నిర్భయంగా ఉండాలి. కుక్క తన యజమానిని రక్షించుకోవడానికి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టగలదు. పురుషులు ధైర్యసాహసాలకు ఉదాహరణగా ఇలాగే ఉండాలి. తన భార్యను, కుటుంబాన్ని కాపాడుకోవడానికి పురుషుడు ఎప్పుడూ ముందుండాలి.
4. సంతృప్తి..
ఆచార్య చాణక్యుడు తన భార్యను శారీరకంగా, మానసికంగా సంతృప్తికరంగా ఉంచడం పురుషుడి మొదటి బాధ్యత అని చెప్పారు. అలాంటి ప్రేమను పొందిన తర్వాత భార్య ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అంతే కాదు, అలాంటి పురుషులు తమ భార్యల నుండి కూడా పూర్తి ప్రేమను పొందుతారు.
Also read: Locket Wearing Astrology: మెడలో దేవుడి లాకెట్ ధరించడం శుభమా? అశుభమా? జ్యోతిష్యం ఏం చెబుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook