Ys Sharmila Tour: ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల అప్పుడే రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో అలా పార్టీ పటిష్టతకు శ్రీకారం చుట్టారు. అప్పుడే జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. షెడ్యూల్ ఇలా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకు తిరిగి బతికించేందుకు చివరి ప్రయత్నం జరుగుతోంది. ఆ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పార్టీ అద్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించగానే జనంలోకి వెళ్లేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల అంతకంటే ముందు పార్టీ నేతలతో జిల్లాల వారీ సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. కేవలం 9 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు.
రేపు శ్రీకాకుళం నుంచి 9 రోజుల పాటు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభమౌతుంది. జనవరి 31న వైఎస్సార్ కడప జిల్లాలో ముగుస్తుంది. ఈ జిల్లాల పర్యటనలో వివిధ జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ సమావేశాల ద్వారా జిల్లాల్లోపార్టీ పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. రేపు అంటే జనవరి 23న శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా సమీక్ష తరువాత పార్వతీపురంలో పార్వతీపురం మన్యం జిల్లా సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు విజయనగరం జిల్లా సమీక్ష ఉంటుంది. ఇక జనవరి 24వ తేదీన విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమీక్ష ఆాయా జిల్లా కేంద్రాల్లో ఉంటుంది. జనవరి 25వ తేదీన కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా సమీక్షలు ఉంటాయి.
అనంతరం జనవరి 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా సమీక్షలు ఆయా జిల్లాల కేంద్రాల్లో జరుగుతాయి. జనవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లా సమీక్షలు సంబంధిత జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. జనవరి 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లా సమీక్షలుంటాయి. జనవరి 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా సమీక్షలు జరుగుతాయి. జనవరి 30వ తేదీన శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల సమీక్షలుంటాయి. ఇక చివరిగా జనవరి 31న నంద్యాల, కడప జిల్లా సమీక్షలు జరుగుతాయి. జిల్లా సమీక్షల అనంతరం పార్టీ బలమెంత ఉందనేది అంచనా వస్తుంది. ఆ ప్రకారం పార్టీ కార్యవర్గం నియామకం ఉంటుంది.
ఇప్పటికే రానున్న ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల ప్రకటించిన నేపధ్యంలో ఆయా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకంపై దృష్టి సారించవచ్చు.
Also read: Ram mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు దూరంగా అద్వానీ, జోషి, కారణమేంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook