జెట్ ఎయిర్‌వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ఎయిర్ వేస్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం హైదరాబాద్ నుండి 96 మంది ప్రయాణీకులతో జెట్ ఎయిర్‌వేస్ విమానం బయల్దేరి వెళ్ళింది. అయితే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు ఇండోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఇలానే గతవారంలో జెట్ ఎయిర్ వేస్ వార్తల్లో నిలిచింది. ముంబై నుండి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో.. క్యాబిన్‌లోని గాలి ఒత్తిడిని కంట్రోల్ చేసే స్విచ్‌ను ఆన్ చేయడాన్ని విమాన సిబ్బంది మర్చిపోయారు. దీంతో, విమానంలో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొందరి ముక్కు, చెవుల నుంచి రక్తం రాగా... మరికొందరు భరించలేని తలనొప్పితో బాధపడ్డారు. దీంతో విమానం తిరిగి ముంబై చేరుకొని అస్వస్థతకు గురైన ప్రయాణికులను ముంబైలోని ఆసుపత్రికి తరలించారు.
అలానే ఈ నెల ప్రారంభంలో ముంబై నుంచి వస్తున్న 185 మంది ప్రయాణీకులను కలిగి ఉన్న ఇండిగో విమానం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది.
A Hyderabad bound Jet Airways flight with 96 passengers on-board made an emergency landing at Indore airport due to a technical glitch in the engine; All passengers safe pic.twitter.com/JWqfFUwQgr
— ANI (@ANI) September 30, 2018