Bathroom Cleaning: బాత్రూం దుర్వాసన సులభంగా పోగొట్టే చిట్కాలు..

Bathroom Tips:మనం టాయిలెట్స్ ఎంత క్లీన్ చేసిన ఒక్కొక్కసారి బాత్రూం నుంచి చెడు వాసన వస్తూనే ఉంటుంది. నలుగురు మనుషులు ఇంటికి వచ్చారంటే బాత్రూం వాసన పెద్ద సమస్యగా మారుతుంది .మరి సులభంగా ఈ చిన్ని చిట్కాల ద్వారా మీ టాయిలెట్స్ ఎప్పుడు దుర్వాసన లేకుండా ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 05:00 PM IST
Bathroom Cleaning: బాత్రూం దుర్వాసన సులభంగా పోగొట్టే చిట్కాలు..

Bathroom Smell Remover Hacks:ఇంట్లో బాత్రూం అనేది ఎంతో ముఖ్యమైన భాగం. ఒకప్పుడు బాత్రూమ్స్ ఎప్పుడు ఇంటికి బయట ఉండేవి. కానీ ఆధునీకరణ పేరుతో బెడ్ రూమ్ లోకి బాత్రూం తీసుకొచ్చి పెట్టేసారు. దీనివల్ల వసతి మాట పక్కన పెడితే పలు రకాల ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఒక్కొక్కసారి మనం ఎంత శుభ్రం చేసిన టాయిలెట్ వాసన పోదు. కొన్ని సందర్భాలలో ఈ వాసన బెడ్ రూమ్ వరకు వచ్చి మనల్ని చాలా చికాకు పెడుతుంది .మరి అలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలు ఏమిటో చూద్దాం పదండి.

మీరు కూడా మీ ఇంట్లో బాత్రూం, టాయిలెట్ నుంచి వచ్చే దుర్వాసన కారణంగా ఇబ్బంది పడుతుంటే.. ఈ చిట్కాలు మీ కోసమే. బాత్రూంలో ఎప్పుడు కూడా గాలి వెళ్తురు బాగా ఉండే విధంగా చూసుకోవాలి .అలా కుదరని పక్షంలో తేమ లేకుండా బాగా డ్రై అయ్యేలా అన్న మెయింటైన్ చేయాలి. ఎక్కువ తేమ ఉండడం వల్ల బ్యాక్టీరియా సులభంగా స్ప్రెడ్ అవ్వడమే కాకుండా దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంది. మరి ముఖ్యంగా మీ బాత్రూం ముందు ఉండే డోర్ మాట్స్ ప్రతిరోజు అందరు స్నానం చేసిన తరువాత మార్చాలి. లేకపోతే డోర్ మాట్స్ మీద ఉన్న తడి కారణంగా సూక్ష్మ క్రిములు మీ బెడ్ రూమ్ లోకి సులభంగా వచ్చేస్తాయి.

బాత్రూం ఫ్లెష్ లో బయట మార్కెట్లో దొరికే ఫ్లష్మేట్స్ లాంటివి ఉపయోగించవచ్చు.. లేకపోతే కోల్గేట్ మెంతాల్ టూత్ పేస్ట్ కి అక్కడక్కడ పిన్నుతో హోల్స్ పెట్టి ఆ పేస్ట్ ని మీ ఫ్లాష్ లో వేసేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్లష్ కొట్టిన ప్రతిసారి మంచి మెంటల్ స్మెల్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా మీ టాయిలెట్  క్లీన్ గా ఉంటుంది. అలాగే బాత్రూంలో మార్కెట్లో దొరికే ఎయిర్ ఫ్రెషనర్స్ వాడవచ్చు.. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అనుకున్న వాళ్లు లావెండర్ ఆయిల్ లాంటి ఎసెన్షియల్ ఆయిల్ లో ముంచిన దూది ఉండని కబోర్డ్ పైన చిన్న బౌల్ లో ఉంచొచ్చు. ఇది కూడా చాలావరకు మీ బాత్రూం లో వచ్చే దుర్వాసనను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.

మీ టాయిలెట్స్ ఎంత క్లీన్ చేసిన మురికి పోకుండా వాసన వస్తూ ఉంటే.. ఎవరు బాత్రూం వాడని సమయంలో బేకింగ్ సోడా అని కాస్త విమ్లిక్విడ్ లో మిక్స్ చేసి టాయిలెట్ సీట్స్ పై బాగా రబ్ చేసి వదిలేయాలి. ఒక పది నిమిషాలు అయ్యాక టాయిలెట్స్ క్లీన్ చేస్తే తెల్లగా మారడమే కాకుండా దుర్వాసన కూడా పోతుంది. ఇలాంటి చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల మీ బాత్రూమ్స్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. 

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News