Revanth Reddy: ఇదే నా ఆహ్వానం.. ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Swearing Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ కీలక నేతలు అందరూ హాజరవుతున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా నాయకులను ఆహ్వానించారు.
 

  • Dec 06, 2023, 22:18 PM IST
1 /5

ప్రమాణ స్వీకారం సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపించారు.   

2 /5

తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు కాబోయో ముఖ్యమంత్రి. విద్యార్ధుల పోరాటం, అమరవీరుల త్యాగాలు, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు.    

3 /5

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023, డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని అని రేవంత్ రెడ్డి అన్నారు.   

4 /5

ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికి ఇదే ఆహ్వానం.. మీ సీఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి అని లేఖ రాశారు. అంతకుముందు ఢిల్లీ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డి కలిశారు. 

5 /5

గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో ముగిని తేలుతున్నాయి. భారీగా హైదరాబాద్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.