/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Rajasthan Election Results 2023 LIVE Updates: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం 112 స్థానాల్లో బీజేపీ, 71 స్థానాల్లో కాంగ్రెస్, ఇతరుల 16 స్థానాల్లోనూ కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 101 సీట్లు గెలవాలి. ఇప్పటికే కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిందని చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలకే పరిమితమైంది. గెహ్లాట్ వర్సెస్ పైలట్ వాగ్వాదం, పార్టీలో అంతర్గత పోరు కాంగ్రెస్ ఓటమికి కారణాలుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ముందుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ సారి రాజస్థాన్ ఎన్నికల్లో 74.62 శాతం ఓటింగ్ నమోదైంది. 33 జిల్లా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు చేపట్టారు.

రాజస్థాన్‌లో ప్రముఖుల పరిస్థితి ఇలా...
** 21వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి వసుంధర రాజే 51,484 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 1,21,682 ఓట్లను సాధించారు.
** తొమ్మిదో రౌండ్ కౌంటింగ్ తర్వాత టోంక్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ 5702 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 43,395 ఓట్లను సాధించారు.
** 12వ రౌండ్ కౌంటింగ్ తర్వాత బీజేపీ ఎంపీ మరియు తిజారా అభ్యర్థి బాబా బాలక్ నాథ్ 4807 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 64,579 ఓట్లను సాధించారు.
** బీజేపీ ఎంపీ మరియు విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి 17వ రౌండ్ కౌంటింగ్ తర్వాత 56,025 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 1,30,231 ఓట్లను సాధించారు.
** బీజేపీ ఎంపీ మరియు జోత్వారా నుండి అభ్యర్థి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పదిహేనవ రౌండ్ కౌంటింగ్ తర్వాత 11,732 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 82,262 ఓట్లను సాధించారు.
** రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు లచ్మాన్‌గఢ్ అభ్యర్థి గోవింద్ సింగ్ దోతస్రా ఏడవ రౌండ్ కౌంటింగ్ తర్వాత 4205 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 32,725 ఓట్లను సాధించారు.

Also Read: ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​కు బిగ్ షాక్.. మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Rajasthan Election Results 2023 live updates in Telugu: BJP on the way to victory in Rajasthan assembly elections
News Source: 
Home Title: 

రాజస్థాన్‌లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి... విజయం దిశగా బీజేపీ..

Rajasthan Election Results 2023: రాజస్థాన్‌లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి... విజయం దిశగా బీజేపీ..
Caption: 
file photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
రాజస్థాన్‌లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి... విజయం దిశగా బీజేపీ..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, December 3, 2023 - 14:37
Request Count: 
39
Is Breaking News: 
No
Word Count: 
255