Peanuts Benefits: భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గింపోతున్నాయి. ఇలాంటి క్రమంలో అనేక రకాల వ్యాధులు చుట్టు ముట్టే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ సమయంలో అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే ఇలాంటి క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చలి కాలంలో ప్రతి రోజు వేరుశెనగలను సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు వేరుశనగలను స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:
శీతాకాలంలో చల్లని గాలుల కారణంగా చాలా మంది చర్మ సమస్యల బారిన పడతారు. కొంతమందిలో చర్మం నల్లగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆహారంలో వేరుశెనగను చేర్చుకోవాలి. అంతేకాకుండా ఇందులో విటమిన్ B3, నియాసిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు హైపర్‌పిగ్మెంటెడ్ మచ్చలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
ఆకలిని నియంత్రిస్తాయి:
వేరుశనగలో మోనోశాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. దీని కారణంగా పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వేరుశెనగను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పిల్లల కండరాల బలోపేతం కోసం:
వేరుశెనగలో అధిక నాణ్యత గల ప్రోటీన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటితో తయారు చేసిన ఆహారాలకు పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల కండరాలు కూడా బలోపేతమవుతాయి. దీంతో పాటు శరీర అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
క్యాన్సర్ నుంచి ఉపశమనం:
వేరుశెనగలో ఉండే పోషకాలు క్యాన్సర్ నుంచి శరీరాన్ని రక్షించేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్ ప్రొస్టేట్ ట్యూమర్ ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ఛాన్స్‌ను 50 శాతం వరకు తగ్గిస్తుంది. ఇందులో ఉండే రెస్వెరాట్రాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి కూడా సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది:
వేరుశెనగలో ఉండే పోషకాలు గర్భిణీ స్త్రీలకు ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు గర్భధారణ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook