Gautam Gambhir: రోహిత్ ఆ రెండు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడో అర్ధం కావడం లేదు

Gautam Gambhir: 45 రోజులుగా సాగిన క్రికెట్ ప్రపంచకప్ 2023 ముగిసింది. టోర్నీలో చివరి వరకూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా చివర్లో తడబడి కప్ చేజార్చుకుంది. ఇప్పుుడ పోస్ట్ మార్టమ్ అవసరమున్నా లేకున్నా..కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావల్సిందే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 22, 2023, 12:35 PM IST
Gautam Gambhir: రోహిత్ ఆ రెండు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడో అర్ధం కావడం లేదు

Gautam Gambhir: ఐసీసీ ప్రపంచకప్ 2023లో వరుసగా 10 మ్యాచ్‌లు అన్ని జట్లు ఓడించి చిట్టచివరి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఫలితంగా 12 ఏళ్ల తరువాత మూడవసారి దక్కాల్సిన కప్ పోయింది. మొత్తం మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న రెండు నిర్ణయాలపై ఇంకా సమాధానం దొరకడం లేదు. మాజీ క్రికెటర్లు సైతం అదే విస్మయం చెందుతున్నారు.

ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చూశాక టీమ్ ఇండియా ఎందుకంత ఘోరంగా విఫలమైందనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలపై పోస్ట్ మార్టమ్ చేయకపోయినా రెండు ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలుసుకోవల్సి ఉంటుంది. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఈ రెంటింట్లో ఓ ప్రశ్న వేస్తున్నాడు. రోహిత్ శర్మ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్ధం కాలేదంటున్నాడు. దూకుడుగా ఆడుతూ రోహిత్ శర్మ 47 పరుగులకు అవుట్ కాగా శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తరువాత హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ అనుకోని బంతికి హిట్ వికెట్ అయ్యాడు. ఇక విపరీతమైన ఒత్తిడికి గురైన రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దలేకపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్ చివర్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరీ దారుణంగా ఆడాడు. కనీసం బంతిని ఎదుర్కొనేందుకు కూడా భయపడే పరిస్థితి. టెయిల్ ఎండర్లకే ఎక్కువ స్ట్రైకింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు జడేజాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు ఎందుకు పంపించాడో అర్ధం కావడం లేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు. అలాగని రవీంద్ర జడేజా ఏమైనా రాణించాడా అంటే లేనేలేదు. 22 బంతులాడి కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. సూర్యను ముందే పంపి అగ్రెసివ్‌గా ఆడమని చెప్పుంటే ఫలితం మరోలా ఉండి ఉండేది. జట్టుకు మరో 20-30 పరుగులైనా వచ్చి ఉండేవి. సూర్య ఆగ్రెసివ్‌గా ఆడుంటే వికెట్ పోయినా అదనంగా పరుగులు దక్కుండేవి అంటున్నాడు గౌతమ్ గంభీర్. కోహ్లి అవుట్ తరువాత రాహుల్ స్థానంలోనే సూర్యను దింపి ఉంటే బాగుండేదంటున్నాడు. 

ఇక టీమ్ ఇండియా బౌలింగ్ చేసేటప్పుడు తొలి మూడు వికెట్లు పేసర్లు బూమ్రా, షమీలకు దక్కాయి. కానీ 17వ ఓవర్ వరకూ మూడవ పేసర్ సిరాజ్‌కు బౌలింగ్ ఇవ్వలేదు. ఇది కూడా రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కాదా అనే సందేహాలు విన్పిస్తున్నాయి. 

Also read: ICC New Rules: ఐసీసీ కొత్త రూల్స్.. ఆ తప్పు చేస్తే 5 రన్స్ పెనాల్టీ.. భారత్-ఆసీస్ సిరీస్‌ నుంచే అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News