Suresh Kondeti About Santosham Film Awards 2023: ఈ నెల 18న హైదరాబాద్‌లో సంతోష ఓటీటీ అవార్డ్స్ నిర్వహిస్తున్నట్లు సంతోషం అధినేత సురేష్ కొండేటి తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 2వ తేదీన గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నామని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికీ.. అలాగే మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటీటీ అవార్డ్స్ కూడా గతేడాది మొట్టమొదటిగా మొదలుపెట్టింది సంతోషం సంస్థ అని ఆయన తెలిపారు. రెండోసారి ఈ ఏడాది కూడా ఈ నెల 18న ఓటీటీ అవార్డ్స్‌ని నిర్వహిస్తామని తెలపారు.
సంతోషం సంస్థ నుంచి 25 ఏళ్లు అవార్డులు అందజేయాలని అనుకున్నానని.. ఇప్పటికి 21 ఏళ్లు అయిందన్నారు సురేష్ కొండేటి. మరో మూడేళ్లు అవార్డుల వేడుకను నిర్వహిస్తానని.. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలన్నారు. సంతోషం మ్యాగజైన్ మొదలు పెట్టినప్పుడు తన వయసు చాలా తక్కువ అని.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులు ఇచ్చిన ప్రోత్సాహంతో సంతోషం అవార్డులు మొదలు పెట్టానని తెలిపారు.
సంతోషం సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డులను నిర్వహించగలడని టాలీవుడ్ కింగ్ నాగార్జున అన్నారని.. ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని తాను నిలబెట్టుకోవాలనుకున్నట్లు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు తాను చేయగలనని నమ్మి.. తన తపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఎక్కడా ఆగకుండా నిర్వహించానని చెప్పుకొచ్చారు. వేడుక నిర్వహణకు గోవా ప్రభుత్వం సహకారం మర్చిపోలేనిదని సురేష్ కొండేటి అన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని తెలిపారు.
జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు సురేష్ కొండేటి. ఆ తరువాత డిస్టిబ్యూటర్‌గా, ప్రొడ్యూసర్‌గా.. యాక్టర్‌గా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సంతోషం మేగజైన్ ప్రారంభించిన సురేష్ కొండేటి.. సంతోషం పేరు మీదనే గత 21 ఏళ్లుగా అవార్డుల ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. గోవాలో వేడుక నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు లభించాయి.
Also Read: CM KCR: నీళ్ల కోసం ఏడ్చినం.. 58 ఏండ్ల దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్: సీఎం కేసీఆర్ ఫైర్
Also Read: Yatra 2 Movie: యాత్ర-2లో సోనియా పాత్ర పోషించిన జర్మనీ నటి ఎవరంటే..? ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి