తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హాడావిడీ చాలా వాడి వేడిగా జరుగుతుంది. ఎన్నికల ప్రచారాల్లో, సభల్లో నాయకులు, కార్యకర్తలు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై మరొకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
ఇక నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ ప్రజలకు మరియు దొరల తెలంగాణకు జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. "కేసిఆర్ నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయి.. మళ్ళీ కెసిఆరే సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రజలు ఎక్కడ సభ పెట్టిన లక్షల మంది వస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మహిళలకి పెద్ద పీట వేయబోతున్నాం. మాది పేదల ప్రభుత్వం.. ఈ తోమిదిన్నరెళ్ళలో ఎక్కడ కూడా గొడవలు జరజలేదు. అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. కూకట్ పల్లి ఎమ్మెల్యేను ఈ సారి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే చిల్లర మాటలు మీరు గమనించండి. రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.
Also Read: Telangana: బీజేపీకు రాజీనామా, సొంతగూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్
దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణ పోటీ అని రాహుల్ అంటున్నారు. నిజమే ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోటీ ఇది.. మీ తాత నెహ్రూ బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపాడు.. 1956 లో ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇలా కలపటం వల్ల 56 యేళ్లు తెలంగాణ తల్లి గోస పడ్డది. రాహుల్ గాంధీ నాయనమ్మ వల్ల వందల మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఢిల్లీ దొరల కారణంగా వేల మంది బలిదానం చేసుకున్నారు. అనివార్యంగా తర్వత తెలంగాణ ఇస్తామని ప్రకటన చేశారు.
అప్పుడు కాంగ్రెస్ దొరలతో,ఇప్పుడు మరో మోడీ బీజేపీ దొర తో పోరాడుతున్నాం. మీ ఢిల్లీ అహంకారానికి తెలంగాణ తల వంచదు, దించదు. ఓటు కు నోటుకు దొంగ పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఎవడెవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తి రాహుల్ గాంధీ చిల్లరగాల్లకు పదవులు ఇచ్చే రాహుల్ గాంధీ మాకు నీతులు చెప్పనవరసరంలేదని మంత్రి కే టీ రామారావు స్పష్టం చేసారు.
Also Read: Adikeshava Release Date: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. 'ఆదికేశవ'మూవీ రిలీజ్ వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
ఢిల్లీ దొరలకు - తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ: రాహుల్ కి కేటీఆర్ కౌంటర్