Lakshmi Narayana: సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ అధికారి చేసిన వ్యాఖ్యలపై వివిధ రకాల రాజకీయా ఊహాగానాలు అలముకున్నాయి. ఈ క్రమంలో ఆ అధికారి ఓ పార్టీలో చేరిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఇప్పుడా అధికారి స్పష్టత ఇచ్చుకున్నారు.
ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని పూర్వ విద్యార్ధుల కార్యక్రమానికి ఆహ్వానించేందుకు సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోంది. అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ సంక్షేమ కార్యక్రమాలపై, జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇక అప్పట్నించి లక్ష్మీ నారాయణ వైసీపీలో చేరిపోతున్నారనే ప్రచారం విస్తృతమైంది. అందుకే లక్ష్మీ నారాయణ ట్వీట్ ద్వారా దీనిపై స్పందించారు. వైసీపీలో చేరుతున్నాననే ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు.
ఓ కార్యక్రమానికి వెల్లి అభినందించినంత మాత్రాన ఆ పార్టీలో చేరుతున్నట్టు కాదన్నారు. రానున్న ఎన్నికల్లో తాను అధికార పార్టీ తరపున పోటీ చేస్తానని ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. అలాంటి ప్రచారం, ఊహాగానాల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తనవరకూ ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమానికి కట్టుబడి ఉన్నానన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ నారాయణ జగనన్న సురక్ష, నాడు నేడు కార్యక్రమాల్ని ప్రశంసించారు. వైద్యా వైద్య రంగాల్లో మార్పులు చేసేవారికి ఫలితాలు బాగుంటాయన్నారు. ఈ రెండు పధకాలు చాలా మందివని కీర్తించారు. స్కూళ్లో పిల్లలకు ఇప్పుడు పౌష్ఠికాహారం లభిస్తోందని, పాఠశాలలు అన్ని సౌకర్యాలతో సుందరంగా కన్పిస్తున్నాయన్నారు. అదే సమయంలో జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా రోజుల తరబడి క్యాంపులు నిర్వహిస్తూ అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.
ఈ వ్యాఖ్యల పర్యవసానమే ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారానికి కారణమైంది. వారం రోజుల్నించి ఈ అంశం గట్టిగానే వ్యాపిస్తోంది. చివరికి లక్ష్మీ నారాయణ స్వయంగా వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది.
Also read: Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ విచారణ, ఊరట లభించేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook