Karwa chauth festival: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో కర్వా చౌత్ ఒకటి. ఈ పండుగకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరు ఉంది. ఈ పెస్టివల్ ను తెలుగు రాష్టాల్లో 'అట్ల తద్ది' అని పేరుతో పిలుస్తారు. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఈ వేడుకను ముఖ్యంగా హిందూ మరియు పంజాబీ కమ్యూనిటీల్లో వివాహిత స్త్రీలు జరుపుకుంటారు. భర్తల దీర్ఘాయువు మరియు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ నిర్జల వ్రతాన్ని పాటిస్తారు మహిళలు. ఈ పండుగను ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు జరుపుకుంటారు. ఇది దసరా పండుగ అయ్యాక ఎనిమిది రోజులకు వస్తుంది.
అయితే ఈ సంవత్సరం కర్వా చౌత్ ఎప్పుడు చేసుకోవాలనే విషయంలో జనాల్లో గందరగోళం నెలకొంది. అక్టోబరు 31 అని కొందరు, నవంబరు 01న అని మరికొందరు అంటున్నారు. ఈసారి అట్ల తద్ది నవంబరు 01, బుధవారం జరుపుకోవాలి. అయితే ఈ పండుగను పెళ్లైనా ఆడవారు మాత్రమే కాదు.. పెళ్లికానీ యువతలు కూడా జరుపుకోవచ్చు. మంచి భర్త రావాలని, వైవాహిక జీవితం బాగుండాలని ఈ నోము నోచుకుంటారు కన్నె పిల్లలు.
కర్వా చౌత్ 2023 ముహూర్తం
కర్వా చౌత్ ఉపవాస సమయం - ఉదయం 06:36 - రాత్రి 08:26
కర్వా చౌత్ పూజ ముహూర్తం - సాయంత్రం 05.44- రాత్రి 07.02 (1 నవంబర్ 2023)
చంద్రోదయ సమయం - రాత్రి 08:26 (1 నవంబర్ 2023)
పూజా విధానం
కర్వా చౌత్ రోజున మహిళలు, కన్నె పిల్లలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేస్తారు. వీరు రోజంతా ఉపవాసం ఉంటారు. గౌరీ దేవికి పూజ చేస్తారు. ఆ తల్లికి నైవేద్యంగా అట్లు పెడతారు. అందుకే దీనిని అట్ల తద్ది అని పిలుస్తారు. సాయంత్రం మహిళలు పెళ్లికూతురులా ముస్తాబవుతారు. అనంతరం జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ ఉపవాసం విరమిస్తారు. ఈ నోమును ఆచరించడం వల్ల వారు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారని నమ్మకం.
Also Read: Pregnancy : ఈరోజే పవర్ఫుల్ చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తప్పక ఇవి పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook