Health Tips: శీతాకాలం వైరల్ వ్యాధుల్నించి రక్షణ కల్పించే ఐదు పద్ధతులు ఇవే

Health Tips: దేశంలో వర్షాకాలం ముగిసిపోయింది. ఇక చలికాలం ప్రారంభమౌతోంది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున, రాత్రి వేళ వాతావరణం చల్లగా ఉంటోంది. 

Health Tips: చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా, ఈ సమయంలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వివిధ రకాల వ్యాధుల ముప్పు పెరుగుతుంటుంది. ముఖ్యంగా వైరల్ జ్వరాలు ఎక్కువౌతాయి. జ్వరం, జలుబు, గొంతులో గరగర వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అందుకే చలికాలంలో వైరల్ ముప్పు నుంచి కాపాడుకునేందుకు 5 పద్ధతులు ఆచరించాల్సి ఉంటుంది.

1 /5

రోజూ నిర్ణీత సమయం వ్యాయామంం లేదా వాకింగ్ అలవర్చుకోవాలి.  దీనివల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా రోజూ తగినంత నిద్ర కూడా అవసరం. దీనివల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.

2 /5

రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దాంతో మీ శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. వైరల్ వ్యాధులు తలెత్తకుండా శరీరం పోరాడుతుంది.

3 /5

మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

4 /5

దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు నోరు లేదా ముక్కును కప్పుకోవాలి. మీ వెంట టిష్యూ లేదా కర్చీఫ్ తప్పకుండా ఉంచుకోవాలి. 

5 /5

చేతుల్ని సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకించి శౌచాలయం నుంచి వచ్చిన తరువాత భోజనం చేసిన తరువాత ఈ పద్ధతి పాటించాలి.