Revanth Reddy Challenges to CM KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి.. బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైందని.. జాబితాలో ఉన్నవారికి అభినందనలు తెలిపారు. తమ అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్‌లు పంచారని అన్నారు. అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందు ఉందన్నారు. తాము 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ కేవలం 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారని పేర్కొన్నారు.
"కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు. మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారు. బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయింది. కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారు. బీఆర్ఎస్‌కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం-అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. మేం ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆర్‌ఎస్ నేతలు అదేలా సాధ్యమన్నారు.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత కోల్పోయారు. కేసీఆర్‌లా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయగలం.. వీటి అమలు సాధ్యమని కేసీఆర్ రాజముద్ర వేసి మరీ అంగీకరించారు.
కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యమని కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ప్రజలకు అర్ధమైంది. అర్థంపర్ధం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎక్కడో డబ్బులు దొరికితే మాపై ఆరోపణలు చేస్తున్నారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ వైఫల్యం చెందారు.. అందుకే చలి జ్వరంతో ఇంట్లో కూర్చున్నారు. కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నా.. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా.. కేసీఆర్ నువ్వు అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం..
నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయకపోతే.. ప్రతీ నెల ఉద్యోగులకు, ఆసరా పెన్షనర్లకు ప్రతీ నెలా మొదటి తారీఖు వాళ్ళ ఖాతాలో వేయాలని కేసీఆర్‌కు మరో సవాల్ విసురుతున్నా.. అలా అయితేనే మీరు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తారని నమ్ముతాం.. ఇవాళ ప్రెస్‌మీట్‌లో రాబోయే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కేసీఆర్ కనిపించారు. కాడి కిందపడేసిన కేసీఆర్ కనిపించారు. కేసీఆర్.. మీ పాలనకు ఎక్స్ పైరీ డేట్ అయిపోయింది.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి.." అని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook