Chandrababu Case Updates: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై చంద్రబాబును విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. అక్టోబర్ 16 సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చాల్సిందిగా ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్కిల్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించగా స్కాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడదే క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. రేపు తీర్పు వెల్లడి కానుంది. స్కిల్ కేసులో హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ అక్టోబర్ 17కు వాయిదా పడింది.
ఈలోగా ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను ఏసీబీ కోర్టు ఆమోదించడంతో అక్టోబర్ 16న చంద్రబాబును కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆరోజు ఏసీబీ కోర్టులో ఫైబర్‌నెట్ కేసుపై విచారణ జరగనుంది. విచారణ అనంతరం చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈలోగా అంటే రేపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై తీర్పు వస్తే ఇంటర్వీన్ కావచ్చని చంద్రబాబు న్యాయవాదులకు కోర్టు సూచించింది.
అక్టోబర్ 16 సోమవారం నాడు ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 5 గంటల్లోపు చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. అంటే ఒకవేళ చంద్రబాబుకు స్కిల్ కేసులో బెయిల్ వచ్చినా ఫైబర్‌నెట్ కేసు ఇబ్బందిగా మారవచ్చు. ఈలోగా అంగళ్లు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులున్నాయి. మరోవైపు స్కిల్ కేసులో లోకేశ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. లోకేశ్‌ను ముద్దాయిగా చూపలేనందున అరెస్టు కూడా చేయమని సీఐడీ చెప్పడంతో కోర్టు లోకేశ్ పిటీషన్ కొట్టివేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu Case Updates: చంద్రబాబుకు షాక్, ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌కు ఓకే