Birth Certificate Rules And Regulations: బర్త్ సర్టిఫికెట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో అడ్మిషన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ వరకు.. ఆధార్ కార్డ్ నుంచి పాస్‌పోర్ట్ వరకు బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా తీసుకోనుంది. ఈ మేరకు నిబంధనల్లో మార్పు చేస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వివాహ రిజిస్ట్రేషన్‌ను కూడా ఇతర పత్రాలు ఏమీ అవసరం లేదు. జనన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో జనన, మరణ నమోదు (సవరణ) చట్టం 2023ని ఆమోదించింది. ఆగస్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం.. జనన, మరణ నమోదు (సవరణ) చట్టం 2023లోని సెక్షన్ 1లోని సబ్ సెక్షన్ (2) ద్వారా అందించిన అధికారాలను అమలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఇక ఈ చట్టం అమలుతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌ను విద్యా సంస్థలలో అడ్మిషన్‌కు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, వివాహ నమోదు వంటి అనేక ఇతర పనులకు సింగిల్ డాంక్యుమెంట్‌గా ఉపయోగించవచ్చు. దీంతో బర్త్ సర్టిఫికెట్‌కు మరింత ప్రాధాన్యత పెరగనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జననాలు, మరణాల డేటా బేస్‌ను రూపొందించడం కూడా సులభం అవుతుంది. కొత్త చట్ట అమలుతో ప్రజలకు పెద్ద ఊరట కలిగించే విషయం ఏంటంటే.. జనన ధృవీకరణ పత్రాలు ఇక నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రజలకు హార్డ్ కాపీలను ప్రభుత్వం అందజేస్తోంది.
ప్రస్తుతం వీటి కోసం చాలాసార్లు ప్రజలు వారాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. దీంతో ఈ కష్టాలకు చెక్ పడనుంది. ఆన్‌లైన్‌లో సులభంగా పొందొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్‌ను ధృవీకరించడానికి ఇక నుంచి అనేక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దత్తత తీసుకున్న పిల్లలు, అనాథల నమోదు కూడా సులభతరం కానుంది. వైద్య సంస్థలు, రిజిస్ట్రార్ ఇక నుంచి డేత్ సర్టిఫికెట్లను కచ్చితంగా అందించాల్సి ఉంటుంది.
Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..