ED Notice To MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. శుక్రవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారిన తరువాత కవితను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కవితకు తాను బినామీనంటూ గతంలో అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఇవ్వగా.. ఇటీవల అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇక నోటీసులను కవిత లైట్ తీసుకున్నారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేశారు. తనకు మోడీ నోటీసు వచ్చిందని.. రాజకీయ కక్షసాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అని అన్నారు. నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నోటీసును పార్టీ లీగల్ టీమ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. లీగల్ టీమ్ సలహా ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఇది గతేడాది కాలంగా కొనసాగుతూనే ఉందని.. టీవీ సీరియల్లా కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు రానుండడంతో మళ్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. ఈ విచారణ ఎంత కాలం కొనసాగుతుందో తెలియదన్నారు ఎమ్మెల్సీ కవిత.
దీంతో ఈడీ విచారణకు ఆమె హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది. ఈడీ నోటీసులను కవిత పెద్దగా పటించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరకాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలతో కవిత షెడ్యూల్ బిజీగా ఉందని.. విచారణకు హాజరయ్యేది అనుమానమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈడీ నోటీసులపై సీఎ కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌తో చర్చించిన తరువాతే ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గతంలోనే విచారణకు హాజరయ్యారు కవిత. అప్పుడే ఆమెను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఈ కేసులో పెద్దగా పురగోతి లేదు. తెలంగాణలో ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కేసులో మళ్లీ ఈడీ దూకుడు పెంచడం రాజకీయంగా కలకలం రేపుతోంది. విచారణకు హాజరైతే కవితను అరెస్ట్ చేస్తారా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook