Venus Transit 2023: హిందూమతంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉందని భావిస్తారు. అదే సమయంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. శుక్ర గ్రహాన్ని భౌతికమైన సుఖాలకు కారకుడిగా చెబుతారు. అందుకే శుక్రుడి కదలిక ప్రబావం ఇతర రాశులపై గణనీయంగానే ఉంటుంది.
జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబర్ 4వ తేదీన శుక్రుడు కర్కాటక రాశిలో పయనమయ్యాడు. శుక్రుడి ఈ గమనంతో అన్ని రాశుల జీవితాలపై ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఈ ప్రభావం ప్రతికూలంగా, అనుకూలంగా ఉండనుంది. శుక్రుడిని ధన సంపదలు, సుఖ వైభోగం, భౌతిక సుఖాలు, విలాసవంత జీవితాలకు కారుకుడిగా భావిస్తారు. కుండలిలో శుక్రుడి స్థితి కారణంగా ఆ వ్యక్తికి అంతులేని ధనం లభించనుంది. డిసెంబర్ వరకూ కొన్ని రాశులకు ఓ వరంగా భావించాల్సి ఉంటుంది.
శుక్రుడి గమనం ప్రభావం మిధున రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఊహించని మార్గాల్నించి ధనలాభం కలిగే సూచనలున్నాయి. ఆర్ధిక సమస్యల్ని బయటపడేందుకు తోడ్పాటు లభిస్తుంది. పూర్వీకుల సంపద లాభదాయకం కానుంది. ఈ జాతకుల ఆర్ధిక పరిస్థితి పటిష్టం కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సక్రమమార్గంతో కన్యా రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఆదాయంలో వృద్ది కన్పిస్తుంది. ఆదాయానికి కొత్తమార్గాలు కన్పిస్తాయి. వ్యక్తి ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. వ్యాపార వర్గాలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల్ని ఆర్జిస్తాయి.
జ్యోతిష్యం ప్రకారం శుక్రగ్రహం మార్గీకరణ కారణంగా తులా రాశి జాతకులకు చాలా అనువైన సమయం. ఉద్యోగం కోసం అణ్వేషిస్తుంటే ఇదే మంచి అవకాశం. కొత్త ఉద్యోగాలు లభించవచ్చు. వ్యక్తి కోర్కెలు పూర్తవుతాయి. కొత్త పనుల కోసం ఆలోచిస్తుంటే ఆలస్యం చేయకపోవడం మంచిది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. డబ్బులకు ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
Also read: Sun Transit 2023: ఈ రాశి వారికి సెప్టెంబర్ 17 నుంచి మహర్దశ, నెలరోజులు తిరుగుండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook