YS Sharmila Comments on CM KCR: రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎట్లున్నదో సొసైటీల ముందట ఎరువుల కోసం నిలుసున్న రైతన్నలను అడిగితే తెలుస్తుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదేనా దొరా.. మీరు చెబుతున్న రైతు రాజ్యం..? అని ప్రశ్నించారు. ఎరువుల కోసం పడిగాపులు కాయడమేనా రైతు సంక్షేమం..? అని నిలదీశారు. పంట పండించేందుకు సాయం లేదని.. పండిన పంట కొనేందుకు దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర రైతులకు 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితం అని ఊదరగొట్టారని మండిపడ్డారు షర్మిల. రాష్ట్రంలో 55 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం అన్నారని.. కేసీఆర్ పుట్టిందే ఇందుకోసం అని గప్పాలు కొట్టారని ఎద్దేవా చేశారు. ఏ రాష్ట్రం అమలు చేయలేదు అంటూ గొప్పలు చెప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రగతి భవన్ వేదికగా.. రైతుల సాక్షిగా హామీ ఇచ్చి ఆరేండ్లు దాటినా దొర మాటకు విలువ లేదని మండిపడ్డారు.
ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న చిత్తశుద్ది కేసీఆర్ సర్కారు లేదని షర్మిల ఫైర్ అయ్యారు. ఉచితం మాట అటుంచితే ఎరువులు కొందామన్నా దొరకని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అన్నారు. రైతును రాజు చేశానని గప్పాలు కొట్టుకుంటూ ఎరువుల కోసం సొసైటీల ముందట నిల్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
"కేసీఆర్ పుట్టిందే రైతులను నట్టేట ముంచడానికి అని నిరూపించిన దొర గారు.. మీ రాజకీయాలు పక్కనబెట్టి రైతులు పడుతున్న కష్టాలను చూడండి. తక్షణమే ఎరువుల కొరత లేకుండా చూడండి. ఈ ఖరీఫ్‌కు అయినా ఉచిత ఎరువులు ఇచ్చి మాట నిలబెట్టుకోండి.." అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: SBI RD Interest Rates: ఎస్బీఐ ఆర్డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?
Also Read: Tanu Jain: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి.. టీచర్‌గా మారి.. తనూ జైన్ లైఫ్ స్టోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి