Morocco Earthquake Updates: మొరాకో భూకంపంలో మరణమృదంగం, 2 వేలు దాటిన మరణాల సంఖ్య

Morocco Earthquake Updates: ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకోను భారీ భూకంపం విలవిల్లాడించింది. భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. మొరాకో భూకంపంలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2023, 01:55 PM IST
Morocco Earthquake Updates: మొరాకో భూకంపంలో మరణమృదంగం, 2 వేలు దాటిన మరణాల సంఖ్య

Morocco Earthquake Updates: భూకంపాలు అరుదుగా సంభవించే ఆఫ్రికాలో సంభవించిన భారీ భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. మరణాలు, క్షతగాత్రుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 

ప్రస్తుతం ఆఫ్రికా దేశం మొరాకోలో సంభవించిన భూకంపం ధాటికి ఎటు చూసినా మృతదేహాల కుప్పలు దర్శనమిస్తున్నాయి. మొన్న రాత్రి సంభవించిన భూకంపంలో మొరాకో సహా మరాకేశ్, ఇతర ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని పెద్ద పెద్ద భవంతులు, ఇళ్లు అన్నీ నేలమట్టమయ్యాయి. మరాకేశ్‌లో అన్నీ ప్రాచీన భవంతులు కావడంతో పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. ఈ భూకంపంలో మరణాల సంఖ్య 2 వేలు దాటేసింది. అత్యంత పురాత, చారిత్రక, యునెస్కో గుర్తింపు పొందిన నగరమైన మరాకేశ్‌లో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప కేంద్రం కూడా మరాకేశ్‌కు 72 కిలోమీటర్ల నైరుతి దిశలో కేంద్రీకృతమైంది.

గత ఆరేడు దశాబ్దాల్లో ఇదే అతిపెద్ద భూకంపంగా పరిగణిస్తున్నారు. 1960లో భూకంపం సంభవించినప్పుడు 12000 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత 2004లో ఈశాన్య మొరాకోలో సంభవించిన భూకంపంలో 926 మంది మృత్యువాతపడ్డారు. తిరిగి తాజాగా జరిగిన భూకంపంలో ఇప్పటి వరకూ 2032 మంది మరణించగా, 2059 మంది గాయపడ్డారు. ఇందులో 1400 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. భూకంపం ధాటికి మరాకేశ్-సఫి ప్రాంతంలో ఆస్థి, ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. భూకంపం కారణంగా 45 లక్షలమంది ప్రభావితమైనట్టు సమాచారం.

భారీ భూకంపం కారణంగా మరాకేశ్‌లోని 12వ శతాబ్దానికి చెందిన ప్రాచీన మసీదు దెబ్బతిన్నది. యునెస్కో ప్రపంచ వారసత్వంగా భావించే రెడ్ వాల్స్ కూడా దెబ్బతిన్నాయి. భూకంపం నేపధ్యంలో దేశంలో మూడ్రోజులు సంతాప దినాలు ప్రకటించారు. 

Also read: Morocco Earthquake Pics: భూకంపంతో మొరాకో విధ్వంసం, చారిత్రక యునెస్కో హెరిటేజ్ సిటీ ధ్వంసం ఫోటోలు మీ కోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News