దక్షిణ కొరియాలోని చాంగౌన్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ విభాగంలో 245.5 పాయింట్ల అత్యుత్తమ స్కోర్‌తో షూటర్ సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదివరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డుని తానే అధిగమించిన సౌరభ్ చౌదరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గోల్డ్ మెడల్ గెలిచిన సౌరభ్ చౌదరిని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అభినందించారు.
Saurabh goes for GOLD! #SaurabhChaudhary went all guns blazing in the 10m Air Pistol Men's Junior event in Korea as he bagged a GOLD with a junior world record setting score 245.5! I am incredibly proud of our youth who are taking India places with their talent & hard work. pic.twitter.com/pdaKYT0Huh
— Rajyavardhan Rathore (@Ra_THORe) September 6, 2018
ఇక ఇదే పోటీల్లో 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అర్జున్ సింగ్ చీమా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో "అర్జున్ హిట్స్ ది టార్గెట్" అంటూ అర్జున్ సింగ్‌ని సైతం ప్రశంసిస్తూ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు.
Arjun hits the target!
Congratulations to Arjun Singh for pulling off a great shot in the 10m Air Pistol Men's Junior event to win a BRONZE. Wishing you many more victories and laurels in the years to come! 👏#KheloIndia pic.twitter.com/7c1eG0fJn4
— Rajyavardhan Rathore (@Ra_THORe) September 6, 2018