India Vs Pakistan Dream11 Prediction Tips and Streaming Details: ఆసియా కప్‌లో దాయాదుల మధ్య సమరం మరోసారి జరగనుంది. సూపర్-4లో రేపు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. గ్రూప్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. కొలంబో వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ తుది జట్టులో చేరనున్నాడు. అక్షర్ పటేల్‌ను కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండనున్నాయి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..
కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం భారత్, పాక్ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లదే పైచేయిగా ఉంటుంది. పేసర్లు మ్యాచ్ చివర్ల పిచ్ నుంచి కొంత సహాయం పొందవచ్చు. ఈ వికెట్‌పై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 260 పరుగులుగా ఉంది. ఇక్కడ రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు మంచి రికార్డులు లేవు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..
వేదిక: ఆర్.ప్రేమదాస స్టేడియం, శ్రీలంక
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు నుంచి ప్రారంభం
స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ +హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.
డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..
వికెట్ కీపర్లు: మహ్మద్ రిజ్వాన్, ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), బాబర్ అజామ్
ఆల్‌రౌండర్లు: షాదాబ్ ఖాన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్
Also Read: Chandrababu Arrest: ఆర్ధిక నేరాల్లో నోటీసులెందుకు, చంద్రబాబుపై అరెస్టుపై స్పష్టత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook