SBI Savings Account News: మీరు బ్యాంకులలో లోన్ కోసం వెళితే కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని కండీషన్ పెడతారు. తమకు బయట బీమా ఉందన్నా.. తమ బ్యాంకులో తీసుకోవాల్సిందేనని చెబుతారు. దీంతో కొందరు బలవంతంగా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇక కొందరు అయితే తమ అంగీకారం లేకుండానే బీమా ప్రీమియంల కోసం తమ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై ఎస్‌బీఐ ఖాతాదారులు ఇటీవల సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. తన సేవింగ్స్ ఖాతా నుంచి రూ.23,451 డెబిట్ అయ్యాయని ఓ కస్టమర్ ఎస్‌బీఐకి కంప్లైంట్ చేశాడు.
అయితే బీమా, ఇతర పెట్టుబడి ఉత్పత్తులను ఎంచుకోవడం పూర్తిగా కస్టమర్ల ఇష్టమని అని బ్యాంక్ చెబుతోంది. కస్టమర్లు అనుమతి లేకుండా ఏదైనా లావాదేవీ జరిగితే వినియోగదారులు ఫిర్యాదు నమోదు చేయవచ్చని సూచించింది. “బీమా, ఇతర పెట్టుబడులను ఎంచుకోవడం పూర్తిగా వినియోగదారుల ఇష్టం. మా బ్రాంచ్‌లు మా కస్టమర్‌ల ప్రయోజనం, అవగాహన కోసం సమాచారాన్ని అందజేస్తాయి. కస్టమర్‌లకు సేవలను అందించేటప్పుడు మేము ఉన్నత ప్రమాణాల నైతికతను పాటిస్తాం. కస్టమర్ ఖాతాలో సమ్మతి లేకుండా ఎలాంటి లావాదేవీ జరగదు. మా నుంచి ఏ రకమైన సేవను పొందేందుకు బీమా లేదా పెట్టుబడి తప్పనిసరి కాదని కూడా గమనించండి" అని ఎస్‌బీఐ పేర్కొంది.
మీ ఖాతాలో బీమా పాలసీలు లేదా ఇతర పెట్టుబడి ఉత్పత్తుల కోసం డబ్బులు కట్ అయి ఉంటే crcf.sbi.co.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వ్యక్తిగత విభాగం/వ్యక్తిగత కస్టమర్‌గా- జనరల్ బ్యాంకింగ్>> ఖాతాల నిర్వహణ> వివాదాస్పద డెబిట్/క్రెడిట్ లావాదేవీ, ఇష్యూకి సంబంధించిన సంక్షిప్త వివరాలను చివరి కాలమ్‌లో పేర్కొనాలి. తమ సిబ్బంది కంప్లైంట్‌ను పరిశీలిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.
కాగా ఇటీవల బీమా పాలసీలు, యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి కొన్ని పెట్టుబడి ప్రొడక్ట్స్‌ను బ్యాంకులు అనవసరంగా కొనుగోలు చేయిస్తున్నాయి. వినియోగదారులు తమకు అవసరం లేని పాలసీలు లేదా ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించింది. ఒకవేళ మీ అనుమతి లేకుండా మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అయితే.. వెంటనే సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని లేదా ఆర్‌బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి