Aadhaar Update Last Date: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆధార్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి.. ఎలాగంటే..?

How to Update Aadhar Details Online: మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. పూర్తి వివరాలకు  https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2023, 01:09 PM IST
Aadhaar Update Last Date: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆధార్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి.. ఎలాగంటే..?

How to Update Aadhar Details Online: ప్రస్తుతం ఆధార్ కార్డులేనిదే ఏ పని జరగదు. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు ఆధార్ తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇంత ముఖ్యమైన ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే మీ సేవా కేంద్రాల చుట్టూ.. ఇతర ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగి డబ్బులు చెల్లించి ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా మీ ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI వెల్లడించింది. మీ ఆధార్ కార్డ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే.. ఫ్రీగా మార్చుకోవచ్చని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే మీ వివరాలను అప్‌డేట్ చేసేందుకు ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది.

మార్చి నెలలో ఆధార్ కార్డులో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అప్పట్లో ఈ  అవకాశం 3 నెలలు ఉండగా..  తరువాత మరో 3 నెలలు పొడిగించింది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆధార్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సర్వీస్ ఉచితంగా ఉంటుంది. ఆధార్ కేంద్రంలో వ్యక్తిగత వివరాలను అప్‌లోడ్ చేయడానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు.  
 
ఆన్‌లైన్‌లో ఫ్రీగా ఇలా అప్‌డేట్ చేసుకోండి..

==> ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ ను సందర్శించండి.
==> ఆ తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆధార్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి 
==> ఐడీ, చిరునామా వివరాలను మీ ప్రొఫైల్‌లో ఎంటర్ చేయండి. 
==> ఇప్పుడు తప్పు వివరాలను సరిదిద్దుకోండి. 
==> మీ వివరాలు సరైనవి అయితే.. 'పై వివరాలు సరైనవని నేను ధృవీకరించాను' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి 
==> అనంతరం డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి ఐడెంటిటీ డాక్యుమెంట్‌పై క్లిక్ చేయండి 
==> ఇప్పుడు  డ్యాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి 
==> డ్రాప్ డౌన్ మెను నుండి మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్న అడ్రస్ ప్రూఫ్‌ను ఎంచుకోండి 
==> మీ అడ్రస్‌ ప్రూఫ్‌ను అప్‌లోడ్ చేయాలి. 
==> తరువాత సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయండి. మీ వివరాలు అప్‌డేట్ అయిపోతాయి. 

Also Read: RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!  

Also Read: Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News