Jupiter Retrograde 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గోచారం లేదా తిరోగమనం ఉంటుంది. ఇది వివిద రాశుల పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుందంటారు. ఏదైనా గ్రహం తిరోగమనం లేదా గోచారం అనేది అనుకూల, ప్రతికూల ప్రభావాలకు కారణమౌతుంది. ఇప్పుుడు మనం గురు గ్రహం తిరోగమనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
గ్రహాలకు గురువుగా భావించే గురుడు లేదా బృహస్పతి సెప్టెంబర్ 4వ తేదీన అంటే మరో 24 గంటల్లో ఏకంగా 16 ఏళ్ల తరువాత తిరోగమనం చెందనున్నాడు. కచ్చితంగా ఇది కొన్ని రాశులపై అమితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశులకు అద్బుతమైన, ఊహించని లాభాలు కలగనున్నాయి. సెప్టెంబర్ 4 వ తేదీన గురుడి తిరోగమనం ప్రభావం కొందరికి మాత్రం ప్రతికూలం కానుంది. గురుడిని సుఖ సంతోషాలు, ధనం, ఐశ్వర్యం, కీర్తి, వైభవం వంటివాటికి కారకుడిగా భావిస్తారు. అందుకే కుండలిలో గురుడి స్థితి బాగుంటే..సంబంధిత రంగాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. అది కూడా ఈ మూడు రాశుల జాతకులు 118 రోజుల వరకూ అద్భుతమైన లాభాలు పొందుతారు. సుఖ సంతోషాలతో ఎంజాయ్ చేస్తారు.
గురు గ్రహం తిరోగమనం ప్రభావం సింహ రాశి జాతకులకు ఊహించని లాభాల్ని అందిస్తుంది. ఉద్యోగులకు ఈ సమయంలో చాలా బాగుంటుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లబిస్తాయి. పనిచేసేచోట గౌరవం ఉంటుంది. అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఫలితంగా ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులుండవు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
గురుడి తిరోగమనం ప్రభావం తులా రాశి జాతకులపై అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఈ రాశి వారి జీవితంపై అదంతా స్పష్టంగా గమనించవచ్చు. న్యాయపరమైన అంశాల్లో అంటే కోర్టు వ్యవహారాలుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విబేధాలు దూరమౌతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అమితమైన ధనలాభం ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఉద్యోగులు కోరుకున్న పదోన్నతి లభిస్తుంది.
గురుడి తిరోగమనం ప్రభావంతో మేష రాశి జాతకులకు ఊహించని విధంగా ఉంటుంది. అమితమైన ధనలాభం కలుగుతుంది. ఏకంగా 4 నెలల వరకూ ఈ రాశి వారికి తిరుగుండదు. ఉద్యోగులు, వ్యాపారులకు చాలా అనువైన సమయం. కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం కాగలదు. ఈ సమయంలో అదృష్టం మీకు తోడుగా ఉండటంతో ఇక తిరుగుండదు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం.ః
Also read: Saturn Retrograde 2023: శని తిరోగమనంతో ఈ 3 రాశులకు మరో 72 రోజులు మహర్దశే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook