BSNL-Airtel Recharge Offers: బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ బడ్జెట్ ఆఫర్స్.. అదిరిపోయే బెనిఫిట్స్ మీ కోసం..!

BSNL and Airtel Latest Plans: బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లను ప్రకటించాయి. వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్లాన్లను తీసుకువచ్చాయి. బీఎస్ఎన్ఎల్ రూ.107లో డేటా ఆఫర్‌ను తీసుకువస్తే.. ఎయిర్‌టెల్ రూ.289 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ ఆఫర్‌ను పరిచయం చేసింది. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 25, 2023, 01:01 PM IST
BSNL-Airtel Recharge Offers: బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ బడ్జెట్ ఆఫర్స్.. అదిరిపోయే బెనిఫిట్స్ మీ కోసం..!

BSNL and Airtel Latest Plans: తమ వినియోగదారులకు బడ్జెట్‌ ప్లాన్‌లో సరికొత్త ఆఫర్‌లను ప్రకటిస్తోంది బీఎస్ఎన్ఎల్. పాకెట్ ఫ్రెండ్లీ.. వాల్యూ-ప్యాక్డ్ ప్లాన్‌లతో ఆకట్టుకుంటోంది. వినియోదారుల అవసరానికి తగినట్లు ప్లాన్‌లను పరిచయం చేస్తోంది. తాజాగా రూ.107 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో 3 జీవీ డేటాను  35 రోజుల పొందవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి.. ఎక్కువగా వీడియోలు వీక్షించేవారికి ఈ ప్లాన్ ప్రయోజకరంగా మారనుంది. నిరంతర కనెక్టివిటీని నిర్ధారిస్తూ నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుంది. 

ఈ ప్లాన్‌తో 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్‌ను కూడా బీఎస్‌ఎన్‌ల్ అందజేస్తోంది. పూర్తి 35 రోజుల వ్యవధికి BSNL ట్యూన్స్ సేవకు యాక్సెస్‌ను అందిస్తుంది. సిమ్ యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడనుంది. ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతోనే నెట్‌ను కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. బీఎస్ఎన్ కస్టమర్‌గానే ఉంటూ మీ సిమ్‌ను తక్కువ ఖర్చులో యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కమ్యూనికేషన్ ఛానెల్‌లను తెరిచి ఉంచి.. కనీస డేటా వినియోగం అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ సెట్ అవుతుంది.

ఎయిర్‌టెల్ కూడా వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ.289 ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కల్పిస్తోంది. వినియోగదారులు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 4 జీబీ డేటాను పొందొచ్చు. తక్కువ డేటా అవసరాలు ఉన్న వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉండనుంది. బీఎస్ఎన్‌ఎల్ రూ.107 ప్లాన్, ఎయిర్‌టెల్  రూ.289 ప్లాన్ రెండూ వినియోగదారులకు విభిన్న ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించినవి. మీరు రోజువారీ డేటా వినియోగాన్ని అంచనా వేసుకుని.. బెస్ట్ ప్లాన్‌ను ఎంచుకోండి.

Also Read: PM Modi Letter About Gaddar: మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేం.. గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ  

Also Read: Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News