Venus-Mercury Transit 2023: బుధ, శుక్ర గ్రహాలు కలిస్తే ఇంతే మరి..ఆ మూడు రాశులకు దశ తిరిగినట్టే

Venus-Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశిలోంచి మరో రాశిలోకి మారుతుంటాయి. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. హిందూమతంలో ఈ గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2023, 07:08 AM IST
Venus-Mercury Transit 2023: బుధ, శుక్ర గ్రహాలు కలిస్తే ఇంతే మరి..ఆ మూడు రాశులకు దశ తిరిగినట్టే

Venus-Mercury Transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశుల జాతకాలపై ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండవచ్చు లేదా కొన్నింటిపై అనుకూలంగా ఉండవచ్చు. కొన్ని సందర్బాల్లో ఒకే రాశిలో రెండు మూడు గ్రహాలు కలిసి యుతి ఏర్పరుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాశులకు అద్భుతమైన లాభాలు కలుగుతుంటాయి. దశ తిరిగిపోతుంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

హిందూమతం ప్రకారం శుక్రుడిని వైభవం, లగ్జరీ, సుఖ సంతోషాలకు కారకుడిగా భావిస్తారు అదే సమయంలో బుధుడిని మేథ్స్, తర్కానికి కారకుడంటారు. అలాంటిది ఈ రెండు గ్రహాలు ఇప్పుడు సింహ రాసిలో కలిసి యుతి ఏర్పర్చనున్నాయి. గ్రహాలు ఏర్పరిచే యుతి కొన్ని రాశులకు దశ తిరిగేలా చేస్తే మరి కొన్ని రాశులకు నాశనం చేస్తుంది. బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో యుతి కారణంగా ఆ ప్రభావం అన్ని రాశులపై తప్పకుండా పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం దశ తిరగనుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూడు రాశులపై అంతులేని ధనవర్షం కురవనుంది

వృశ్చిక రాశి జాతకులపై బుధ శుక్ర గ్రహాల యుతి కారణంగా అన్ని వైపుల్నించి పెద్దఎత్తున ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ నారాయణు రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారి వ్యాపారం విస్తృతమై లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరగవచ్చు. ఆర్ధికంగా ఈ రాశి జాతకులు పటిష్టంగా ఉంటారు. వ్యాపారస్థులకు చాలా అనువైన సమయంగా పరిగణిస్తారు. 

ధనస్సు రాశి జాతకులకు ఈ సమయం చాలా అనువైంది. లక్ష్మీ నారాయణ రాజయోగంతో అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో శుభకార్యం జరగవచ్చు. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశముంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆదృష్టం తోడుగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్ధులకు చాలా అనువైన సమయం. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. సింహ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనువైందిగా చెబుతారు. శుక్ర, బుధ గ్రహాల యుతి వల్ల ఏర్పడే లక్ష్మీ నారాయణ రాజయోం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా మూడు రాశులకు అత్యద్బుతంగా ఉండనుంది. కుటుంబసభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారులు రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు.

సింహ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనువైందిగా చెబుతారు. శుక్ర, బుధ గ్రహాల యుతి వల్ల ఏర్పడే లక్ష్మీ నారాయణ రాజయోం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా మూడు రాశులకు అత్యద్బుతంగా ఉండనుంది. కుటుంబసభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారులు రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు.

Also read: Vastu Tips for Plants: ఆ 5 మొక్కల్ని ఈ దిశల్లో ఉంచుతున్నారా..తస్మాత్ జాగ్రత్త సర్వ నాశనమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News