India Vs West Indies 4th T20 Toss and Playing 11: మూడో టీ20 విజయం సాధించిన భారత్.. అదే ఊపులో నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే.. సిరీస్ కరేబియన్ జట్టు సొంతం అవుతుంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విండీస్ గెలుపొందగా.. మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధిస్తే.. దైపాక్షిక సిరీస్‌లో 2016 తరువాత టీ20 సిరీస్‌ను కరీబియన్ జట్టు కైవసం చేసుకుంటుంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బౌలింగ్ చేయనుంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతో భారత్ బరిలోకి దిగుతుండగా.. కరేబియన్ జట్టు మూడు మార్పులు చేసింది.
"మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాము. పిచ్ చాలా బాగా కనిపిస్తోంది. స్కోరు బోర్డు భారీ పరుగులు ఉంచి.. కాపాడుకునేందుకు ప్రయత్నించాలని అనుకుంటున్నాం. భారత్ లాంటి పెద్ద జట్టుపై సిరీస్‌ను గెలవడానికి ఇది ఒక అవకాశం అని భావిస్తున్నాం. మా ఆటగాళ్లు సిరీస్‌ను గెలిచేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. జేసన్ హోల్డర్ , షాయ్ హోప్, ఓడియన్ స్మిత్‌లను తుది జట్టులోకి వచ్చారు.." అని విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ తెలిపాడు.
"టాస్ గెలిచి ఉంటే మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. పిచ్‌లో పెద్దగా మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. పరుగులు చేయాలనే ఆకలితో ఉన్నారు. గత మ్యాచ్‌లో బౌలర్లు వాళ్ల పని సమర్థవంతంగా చేయగా.. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్‌తో గేమ్‌ను ముగించారు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం. ఈ పిచ్‌పై మా స్పిన్నర్లకు వికెట్ టేకింగ్ నైపుణ్యం ఉంది.." అని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వెల్లడించాడు.
తుది జట్లు ఇలా..
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసిన్, ఒబెడ్ మెక్‌కాయ్.
Also Read: Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!
Also Read: BJP Woman Leader Suicide: బీజేపీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్.. మహిళా నేత ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IND Vs WI Match Updates: విండీస్‌తో కీలక సమరం.. టాస్ ఓడిన భారత్.. తుది జట్టులో భారీ మార్పులు..!