Healthy Habits: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమిదే. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలి, ఏం చేయాలి..
మనిషి శరీరం ఎప్పుడూ ఫిట్ అండ్ హెల్తీ లేదా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. దీనికోసం గంటల తరబడి జిమ్ లేదా వాకింగ్ లేదా వర్కవుట్లు అవసరం లేదు. రోజువారీ డైట్ హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఆయిలీ పుడ్స్‌కు దూరంగా ఉండాలి. దీంతోపాటు మూడు పూట్ల క్రమం తప్పకుండా లైట్ వాకింగ్ అనేది చాలా అవసరం. అంటే మద్యాహ్నం,రాత్రి భోజనం చేసిన తరువాత కొన్ని నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.
మనిషి శరీరానికి వ్యాయామం చాలా అవసరం. అయితే ఇది శృతి మించకూడదు. ప్రతి రోజూ హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని ఎముకలు,కండరాలు బలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం వేళ తప్పకుండా రోజుకు 30 నిమిషాలు తప్పకుండా నడవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ రోజంతా రిఫ్రెష్‌గా ఉంటుంది. దీనికితోడు మద్యాహ్నం, రాత్రి భోజనం తరువాత ఓ 7 నిమిషాలు తేలికైన వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాగలదు. మరోవైపు శరీరంలో ఆనందాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. హార్మోన్ల విడుదల వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది.
రోజూ భోజనం తరువాత కేవలం 7 నిమిషాల వాకింగ్ తో తిన్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. మంచి నిద్ర పడుతుంది. ఆహారం నుంచి కావల్సిన పోషకాలు అందుతున్నాయి. రోజూ వాకింగ్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలై జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలిని అరికడుతుంది. రాత్రి భోజనానంతరం కాస్సేపు నడవడంవల్ల త్వరగా అలసిపోయి సుఖమైన నిద్ర పడుతుంది. త్వరగా నిద్రపోయి త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భోజనం తరువాత వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
Also read: Pregnancy Symptoms: గర్భం దాల్చారో లేదో మొదటి వారంలో ఎలా తెలుస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook