Eye Infections: వర్షాకాలం కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐ ఫ్లూ కేసులే కన్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక పెద్దఎత్తున వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే అతి ఇబ్బందికర సమస్య ఇది. మరి ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక సమస్య అత్యంత తీవ్రంగా బాధిస్తోంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ సమస్య ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో చర్మ సంబంధిత సమస్యలు, జ్వరం, దగ్గు, జలుబు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు ప్రధానంగా కన్పించే మరో సమస్య కండ్ల కలక. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కండ్ల కలక సమస్యలే కన్పిస్తున్నాయి. పిల్లల్లో అయితే స్కూల్ నుంచి చాలా వేగంగా ఇతరులకు వ్యాపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఒక్కొక్క రోగి నుంచి 5-8 మందికి ఈ వ్యాధి సోకుతోంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి తప్పకుండా ఉంటోంది.
కండ్ల కలక వచ్చినప్పుడు కళ్లు ఎర్రగా మారిపోతాయి. కంట్లో గుచ్చుకున్నట్టుగా ఉండి చాలా ఇబ్బంది కలుగుతుంది. కంట్లోంచి నిరంతరం పుసి వస్తూ ఉంటుంది. కళ్లు ఉబ్బిపోయి కన్పిస్తాయి. వెలుతురు చూడలేని పరిస్థితి ఉంటుంది. కండ్ల కలక సోకితే 3-5 రోజులు కచ్చితంగా ఉంటుంది. కరోనా వైరస్ కంటే వేగంగా కండ్ల కలక వ్యాప్తి చెందుతుందంటున్నారు వైద్యులు. ఐ ఫ్లూగా, ఐ ఇన్ఫెక్షన్గా అభివర్ణిస్తుంటారు.
కండ్ల కలక వచ్చినప్పుుడు తీసుకోవల్సి న జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. కండ్ల కలక వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కండ్ల కలక వచ్చినప్పుడు సొంత వైద్యం ఎప్పుడూ చేయకూడదు. ఇతరులతో చేతులు కలపకూడదు. మీరు వాడిన టవల్స్, దుప్పట్లు, ఇతర వస్తువుల్ని మరెవరూ వాడకూడదు. ఈ వ్యాధి సోకిన పిల్లల్ని స్కూలుకు అస్సలు పంపించకూడదు.
కండ్ల కలక వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. కళ్లద్దాలు పెట్టుకుని తిరగాలి. ఇతరుల్ని తాకకూడదు. కండ్ల కలక లక్షణాలు కన్పిస్తే సొంత వైద్యం చేయకుండా తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.
Also read: APEAPCET 2023 Couselling: ఏపీఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు, కొత్త తేదీలివే<
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook