Heavy Rains in Warangal: వరంగల్ లో వర్ష బీభత్సం(Heavy Rains) కొనసాగుతోంది. భారీ వానలకు ఓరగల్లు నగరం (Warangal) అతలాకుతలమైంది. నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నగరంలోని రహదారులు, కాలనీలు నీటమునిగాయి. భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరద నీరు పోటెత్తింది. హనుమకొండ-వరంగల్ రహదారి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది.
మరోవైపు నగరంలోని కాజీపేట రైల్వే స్టేషన్ (Kazipet railway station) నీటమునిగింది. స్టేషన్ లో దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచి ఉన్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచి ఉంది. వరంగల్-ఖమ్మం నేషనల్ హైవే జలదిగ్భందమైంది. మైలారం వద్ద భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.
Kazipet Railway Station 🙏@HiWarangal @balaji25_t #Warangal #TelanganaRains pic.twitter.com/ezq7noGb9p
— #Devara (@thebabayaga18_) July 27, 2023
నగరంలోని ప్రధాన రహదారులపైన ఉన్న నాలాలన్నీ పొంగి ప్రవహించడంతో ఎక్కడికి ఎక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు నగర పరిస్థితి దారుణంగా తయారైంది. వరద గుప్పిట్లో చిక్కుకున్న కాలనీల నుంచి ప్రజలను ట్రాక్టర్ల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ రైల్వే స్టేషన్ నీటమునిగింది.
Also Read: Telangana Rains: పూర్తిగా నీటమునిగిన మోరంచపల్లి గ్రామం.. నలుగురు గల్లంతు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలం.. నీటమునిగిన కాజీపేట రైల్వే స్టేషన్..