NDA Meeting: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల భేటీ విజయవంతమైంది. భేటీలో పాల్గొన్న పార్టీలు మరోసారి ప్రధాని మోదీ నేతృత్వంపై నమ్మకం వ్యక్తం చేశాయి. అన్ని పార్టీల నేతలూ కలిసి సంకల్పబలం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
NDA Meeting: ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మిత్ర పక్షాల భేటీ సక్సెస్ అయింది. 2019తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీ సాధించేందుకు 39 పార్టీలు మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంచాయి. ప్రతిపక్షాలు దిశా నిర్దేశం లేకుండా సాగుతున్నాయని ఎన్డీయే భేటీ అభిప్రాయపడింది.
ఎన్డీయే భేటీకు ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీఏ ఏర్పడి 25 ఏళ్లు నిండాయి. రాష్ట్రాల ప్రగతి, అభిృద్దే ఎన్డీయే ప్రధాన లక్ష్యమని భేటీ స్పష్టం చేసింది.
ఎన్డీయే భేటీలో ప్రధాని మోదీని శివసేన చీలిక పక్ష నేత , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కలిశారు.
ఎన్డీఏ ఏర్పడి 25 ఏళ్లు నిండాయి. రాష్ట్రాల ప్రగతి, అభిృద్దే ఎన్డీయే ప్రధాన లక్ష్యమని భేటీ స్పష్టం చేసింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సైతం ఏఐఏడీఎంకే తరపున ఎన్డీయే భేటీలో పాల్గొని ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు.
90వ దశకంలో దేశంలో అస్థిరత కోసం కాంగ్రెస్ పార్టీ కూటములు ఏర్పాటు చేసిందని, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వాల్ని కూల్చేయడం కూడా చేసిందని మోదీ విమర్శించారు.
ఎన్డీయే మిత్ర పక్షాల భేటీలో ప్రధాని మోదీ కీలక విషయాలు ప్రస్తావించారు. అధికారం కోసం అవినీతి కోసం , కుటుంబ పాలన కోసం కూటములు ఏర్పడుతున్నాయని ప్రతిపక్షాల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు.